దారుణం.. అత్యాచారం చేసి.. ఎముకలు విరిచేసి..

savitri shivaleela

బదౌన్(ఉత్తరప్రదేశ్): ఎన్నో నిర్భయ ఘటను.. మరెన్నో దిశ ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మానవ మృగాళ్ల అకృత్యానికి మహిళలు బలవుతూనే ఉన్నారు. అభం శుభం తెలియని పసి పిల్లలనుంచి పండు ముసలి వాళ్ల దాకా మహిళలపై లైంఘిక దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఈ సిగ్గుమాలిన సమాజంలో అమ్మాయికి రక్షణే కరువైంది. ఎంతలా అంటే ఇంటి నుంచి బయటకు వెళ్తే చాలు తిరిగి వస్తుందన్న నమ్మకం లేనంతగా.. ఎందరో దిశలు, నిర్భయలు ఇంకా బలవుతూనే ఉన్నారు. ఎన్నిమిదేళ్ల కందట సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన ఇప్పటికీ మరచిపోలేనిది. అతి దారుణంగా కిరాతకుల చేతిలో దాడికి గురై ప్రాణాలు విడిచింది నిర్భయ. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ లో చేటుచేసుకుంది. సామూహిక లైంఘిక దాడికి గురై ప్రణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. మగాల్లాంటి మృగాళ్ల అకృత్యానికి 50 ఏండ్ల మహిళ సామూహిక అత్యాచారానికి బలైంది.

 గుడికని బయలు దేరిన ఆ మహిళలపై అతి క్రూరంగా దాడికి పాల్పడ్డారు దుండగులు. అత్యాచారం చేసి.. ఆమె పక్కటెముకలు విరగ గొట్టి, ప్రైవేట్ భాగాలను దారుణంగా గాయపరిచి పశువుల్లా ప్రవర్తించారు.  పూర్తి వివరాళ్లోకి వెళితే.. బదౌన్ జిల్లాలోని ఉగైతిలో 50 ఏండ్ల మహిళ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఈమె ఈ నెల 3 న సాయంత్రం వేళల్లో దేవుడి గుడికి వెళ్లింది. కాగా దర్శణానికని వెళ్లిన ఆ మహిళ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులంతా ఆమె గోసం ఊరంతా వెతికారు. కాగా తీవ్ర గాయాలతో ఉన్న ఆ మహిళలను ఆలయ పూజారి, మరో ఇదద్దరు వ్యక్తులు కలిసి తమ కుటుంబానికి అప్పజెప్పారని బాధితురాలి కొడుకు చెప్పాడు. పూజారి తెలిపిన వివరాల ప్రకారం..  బాధితురాలు బావిలో పడిపోయి ఉందని.. ఆమె అరవడంతో అక్కడకు వెళ్లి రక్షించి తీసుకొచ్చినట్టు తెలిపారు. కాగా ఆ తీవ్ర గాయాలైన ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపూ ఆమె చనిపోయింది.

ఈ దారుణంపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కాగా పోస్టుమార్టం రిపోర్టులో ఒల్లుజలదరించే విషయాలు వెళ్లడించారు డాక్టర్లు.. బాధిత మహిళపై సామూహిక అత్యాచారం జరగడంతో పాటుగా ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించినట్టు రిపోర్టులో తెలిసింది. సామూహిక లైంఘిక దాడికి పాల్పడి ఆపై ఆమెపై ఇనుప రాడ్డుతో దాడి చేశారని తేలింది. అలాగే ఈ దాడిలో ఆమె ప్రక్కటెముకలు విరిగాయని, కాళ్లను విరగొట్టారని రిపోర్టులో తెలిసింది. అతికిరాతంగా ఆమె ప్రైవేట్ భాగాలను దారుణంగా గాయపర్చారు. దాంతోపాటుగా ఆమె ఊపిరితిత్తులపై బలంగా కొట్టడంతో ఆమె ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా గాయపడినట్టు తేలింది. ఇంత కర్కషంగా ప్రవర్తించిన మృగాళ్లపై కేసును నమోదు చేసుకుని దర్యాప్తును మొదలు పెట్టారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: