ఛీ.. రోటీలు చేస్తూ వాటిపై ఉమ్మి వేస్తున్న వ్యక్తి.. బట్ట బయలైన అతడి బాగోతం..

savitri shivaleela
పెళ్లిల్లు, పేరంటాల్లో వంటలు గుమగుమలాడుతుంటాయి. పెళ్లికి వచ్చిన వారు కూడా.. ఏం స్పెషల్ చేశారంటూ ఆరా తీస్తుంటారు. ఇక పెళ్లి వారైతే.. పెళ్లికి వచ్చిన అతిథుల నుంచి ఎలాంటి మాట రాకుండా.. అన్ని వసతులను కల్పించడానికి ప్రయత్నిస్తారు. అందులో ముఖ్యంగా భోజనం విషయంలో ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటారు. భోజనాలు బాగాలేవు.. అనే మాట రావొద్దని.. మంచి వంటగాళ్లతో వంట చేయిస్తుంటారు. ఇంకేముంది వంటలన్నీ గుమగుమ వాసనలు రాగానే లొట్టలేసుకుంటూ భోజన ప్రియులు కూడా లాగించేస్తుంటారు. కానీ వంట వెనకున్న అసలు రహస్యాలు మాత్రం ఎవరూ తెలుసుకోలేరు.
ఎందుకంటే ఎవరి బిజీలో వారుంటారు కనుక. అసలు వాళ్లు వంట ఏవిధంగా చేస్తారనే విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఓ రోటీ తయారీ వెనకున్న అసలు రహస్యాన్ని గుట్టు రట్టు చేశాడు. రోటీ ఏవిధంగా తయారు చేస్తున్నాడు. అందులో ఆ వ్యక్తి ఏమేమీ వేస్తున్నాడని వీడియో తీసాడు. ఇంకేముంది అయ్యగారి బాగోతమంతా ఆ వీడియోలో భద్రమైంది. ఇంతకీ ఆరోటీ తయారీ వ్యక్తి ఆ రోటీని ఎలా తయారు చేశాడో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. తాండూరీ రోటీలు చేస్తూ ఓ వ్యక్తి వాటిపై ఉమ్మివేసాడు. ఇది ఉత్తరప్రదేశ్ లోని మారట్ లో చోటుచేసుకుంది. కాగా ఈ వీడియో కాస్త లీక్ అవ్వడంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఇతడు రెట్టెలను తాండూర్ లో వేసేముందు ఉమ్ము వేశాడు. ఈ వ్యక్తిని సోహైల్ గా గుర్తించారు. కాగా పెళ్లిలో ఈ వర్కర్ చేసిన అనుచిత చర్యకు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు మీరట్ లోని స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. దీనిలో భాగంగా హిందూ జాగరణ్ మంచ్ అధ్యక్షుడు సచిన్ సిరోహి మాట్లాడుతూ.. ఇతడు ఒక రకంగా అమాయక ప్రజలను ఛీట్ చెయ్యడమేనని అన్నారు. చూశారు కదా.. ఎంతో రుచిగా ఉందంటూ మనం లొట్టలు వేసుకునే ఫుడ్ వెనక ఎంతో జరుగుతుందనేది. అందుకే ఇలాంటి శుభాకార్యాలు జరిగేటప్పుుడు వంటలు జరిగే దగ్గర ఉండటం మర్చిపోకండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: