భర్తను చంపి దారుణంగా ఇంట్లోనే.. వామ్మో ఈమె నిజంగా రాక్షసే..
గత నెలలో నౌసిన్ అనే మహిళ ఎల్బీ నగర్ పోలీస్టేషన్‌కు వెళ్లింది. తన భర్త పేరు గగన్ అగర్వాల్(38) అని, అతడు చాలా రోజులుగా కనపడడం లేదని ఫిర్యాదు చేసింది. ఆమెతో పాటు గగన్ సోదరుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. అంతేకాదు గగన్‌ను హత్య చేసిన వారెవరో తెలిసి పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు. ఇంతకీ అతడిని హత్య చేసిందెవరో తెలుసా..? ఏమీ తెలియని అమాయకురాలిలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అతడి భార్య నౌసిన్.
గగన్ రెండేళ్ల క్రితం తన మొదటి భార్యకు విడాకులిచ్చి గత జూన్‌లో నౌసిన్ బేగంను పెళ్లి చేసుకున్నాడట. వారిద్దరి కాపురం ఇన్నాళ్లుగా సాఫీగానే సాగుతోంది. కుటుంబ సభ్యలతో కూడా అంతగా వివాదాలు లేవు. కానీ వారిద్దరి మధ్య ఏ వివాదం తలెత్తిందో ఏమో కానీ.. ఆమే స్వయంగా తన భర్తను చంపేసింది. గుట్టుచప్పుడు కాకుండా భర్తను హతమార్చడమే కాకుండా.. ఇంట్లోనే అతడిని పూడ్చిపెట్టినట్లు వెల్లడైందని పోలీసులు చెబుుతున్నారు.
విచారణలో ఈ విషయం బయటపడడంతో పోలీసులు కూడా నిర్ఘాంతపోయారు. వెంటనే గగన్ రెండో భార్య నౌసిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన మరి కొన్ని వివరాలు బయటకు రావల్సిఉందని పోలీసులు చెబుతున్నారు. మరి కట్టుకున్న వాడిని చంపేటంతటి కక్ష ఆమెకు ఎందుకు కలిగిందో ఇంకా తెలియాల్సి ఉంది.