శ్రీవారి హుండీలో డబ్బు చోరీ.. ఇంతలో దిమ్మతిరిగే ట్విస్ట్..?
అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇక భక్తుల రక్షణ విషయంలో కూడా టీటీడీ అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటారు. ఇక తిరుపతి వెళ్ళిన వారు శ్రీవారిని దర్శించుకుని హుండీలో తమకు తోచిన మొత్తాన్ని వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది ప్రబుద్ధులు మాత్రం శ్రీవారి హుండీలో విరాళం వేయడం కాదు ఏకంగా హుండీకే కన్నం వేయాలని చూశారూ. పక్కా ప్రణాళిక ప్రకారం ఇటీవల శ్రీవారి ఆలయంలోకి వచ్చిన కొంతమంది యువకులు చోరీకి ప్రయత్నించారు.
ఒక యువకుడు హుండీ లోని ఏకంగా 30 వేల రూపాయలను చోరికి చేశాడు. అయితే ఇక ఈ తంతు మొత్తం సీసీ కెమెరాల ద్వారా గమనించిన విజిలెన్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి తిరిగి ట్విస్ట్ ఇచ్చారూ . ఇక నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాకుండా నిందితుల దగ్గర్నుంచి 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇక విజిలెన్స్ అధికారులు నిందితులను తిరుమల వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. తిరుమల హుండీలో ఇలా చోరీకి ప్రయత్నం జరగడం కలకలం సృష్టిస్తోంది.