దారుణం .. విద్యార్థిని చితక బాదిన వాచ్ మెన్..

Satvika
విశాఖలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ స్కూల్ లోకి విద్యార్థి సెలవు పూట జొరబడ్డాడని అక్కడ విధులు నిర్వహిస్తున్న వాచ్ మెన్ దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నగరం లోని స్థానిక పాఠశాల లో వాచ్ మెన్ దారుణాని కి ఒడిగట్టాడు. గోడ దూకి పాఠశాలలోకి వచ్చాడనే కోపంతో విద్యార్థిని ఓ వాచ్‌మెన్‌ చితక్కొట్టాడు. వీపు, చేతులు, కాళ్ల పై తీవ్రంగా కొట్టడం తో ఆ విద్యార్థి తల్లి దండ్రులు ఆందోళన చేస్తున్నారు. వెంటనే వాచ్‌మెన్‌ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.


ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా గాజువాక లో జరిగింది. అయితే వాచ్‌మెన్‌ దాడి చేసిన విషయం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పలేదు. రాత్రి చొక్కా తీసి నిద్రిస్తున్న సమయంలో ఒంటి ప్తె ఉన్న దెబ్బలు చూసి తల్లి అడగడం తో ఈ విషయం బయటపడింది. గాజువాక బీసీ రోడ్డు లో ఉన్న మార్వెల్ పాఠశాలలో చ్తెతన్య ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడం తో కొంతమంది విద్యార్థుల తో కలసి ఆడుకునేందుకు పాఠశాలకు వచ్చాడు.


వాచ్‌మెన్ అనుమతి తీసుకుని లోనికి వెళ్లి ఆడుకుంటున్న సమయం లో వేరే అబ్బాయి వచ్చాడు. పాఠశాలల లో ఉన్న బస్సు ఎక్కి హారన్ కొట్టడం తో వాచ్‌మెన్‌కు ఆగ్రహం తెప్పించింది. వెంటనే కర్రతో చితకబాదాడని బాధిత విద్యార్థి ఆరోపించాడు. ఇంటికెళ్లినా విద్యార్థి వాచ్‌మెన్‌ కొట్టిన విషయం తల్లి దండ్రులకు చెప్పలేదు. తెల్లారి వెంటనే పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. బాధిత విద్యార్ధి తల్లి దండ్రులు పాఠశాల ప్రిన్సిపల్‌ను నిలదీశారు. తప్పు చేస్తే ఇంత దారుణంగా వాచ్‌మెన్ కొడతారా అని ప్రశ్నించారు. పాఠశాల నిర్లక్ష్యం వల్లే ఇలా చేశాడని, వెంటనే వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.. ఈ ఘటన స్థానికం గా చర్చలకు దారి తీసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: