కాళ్ల పారాణి ఆరకముందే.. ఊహించని రీతిలో ప్రమాదం.. అసలు ఏమైందంటే..!

N.ANJI
మరణం ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలీదు. అంత సేపు ఆనంద క్షణాలే విషాదాన్ని మిగిలిస్తున్నాయి. తాజాగా నెల రోజుల క్రితం పెళ్లైనా ఓ యువతికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి. ఇక కాళ్లపారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెను మృత్యువు వెంటాండింది. రోడ్డు ప్రమాదంలో ఆ నవ వధువు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని నెలమంగల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిక్కమడ్నూరు గ్రామం దారందకుక్కు‌కు చెందిన గోపిక్‌ కు, బెల్తాంగడి గెరుకట్టేకు చెందిన రూప, పద్మనాభ శెట్టిల కుమార్తె ధనూషతో ఫిబ్రవరి 21న వివాహం జరిగింది. అయితే కొత్తగా పెళ్లైనా ఈ జంట నెల రోజుల పాటు చాలా సంతోషంగా గడిపారు. ఏప్రిల్ 3వ తేదీన బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఓ ఫంక్షన్‌కు హాజరుకావడానికి వీరు మారుతి వ్యాగనార్ కారులో బయలుదేరారు. నూతన జంటతో పాటు వారి బంధువులు శుభలక్ష్మీ, రూపా వేణుగోపాల్‌లు కూడా కారులో బెంగళూరుకు బయలుదేరినవారిలో ఉన్నారు.

అయితే శనివారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారును.. నెలమంగల వద్ద పౌల్ట్రీ ట్రక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో గోపిక్ భార్య ధనూష తీవ్రగాయాలు కావడంతో మృతిచెందింది. ఈ ప్రమాదంలో గోపిక్‌కు, మిగిలిన ఇద్దరు బంధువులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇక  ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ గోపిక్, అతని బంధువులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో.. ఆమె పుట్టింటితో పాటు, అత్తవారింట్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: