సోషల్ మీడియాలో పర్సనల్ ఫోటోలు.. షాకైన మహిళ.. అసలు ఏం జరిగిందంటే..?
అయితే సోషల్ మీడియాలో తన పర్సనల్ ఫోటోలు బయటకు రావడం చూసి షాక్ అయ్యింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లోకి ఎలా వచ్చాయనే దానిపై ఆందోళన చెందింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన 25 ఏళ్ల ఓ యువతి ఇటీవల తన ప్రియుడితో కలిసి ఉన్న కొన్ని పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో చూసి అవాక్కయ్యింది.
ఇక పర్సనల్ ఫోటోలు ఎలా ఇంటర్నెట్‌లోకి వచ్చాయనే దానిపై ఆరా తీసింది. ఇదే అంశంపై గతేడాది సెప్టెంబర్‌లో సైబర్ క్రైమ్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ ఫోటోలు సంజయ్ పటేల్ అనే వ్యక్తి ఫేస్ బుక్ ప్రొఫైల్ నుంచి బయటకు వచ్చాయని గుర్తించారు. అయితే ఆ పేరుతో తనకు ఎవరూ స్నేహితులు లేరని ఆమె పోలీసులకు వివరించింది. దీంతో కేసును మరింత లోతుగా విచారించిన పోలీసులు.. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది బాధితురాలు మాజీ భర్త అని తేల్చారు.
అయితే అంతకుముందు కొన్నేళ్ల క్రితం మరో వ్యక్తిని పెళ్లాడని బాధితురాలు అతడితో విడిపోయింది. తిరిగి తన తల్లిదండ్రులతో ఉంటోంది. అయితే తన మాజీ భార్య మరొకరితో తిరుగుతోందని కోపం పెంచుకున్న బాధితురాలి మాజీ భర్త.. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఫోటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి వాటి ద్వారా బయటపెట్టాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.