భార్యను, అత్తను చంపిన అల్లుడు.. ఎందుకో తెలుసా..?

praveen
ఈ మధ్యకాలంలో భార్య భర్తల బంధం అంటే అసలు విలువ లేకుండా పోతుంది.  ముఖ్యంగా నేటి రోజుల్లో వావివరసలు మరుస్తున్న మనుషులు ఉన్మాదులుగా మారిపోయి సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న ఘటనలు చేస్తూ ఉంటే ఇక సభ్య సమాజం మొత్తం ఉకొలిక్కి పడే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రతి మనిషి జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఎందుకంటే రక్షణగా ఉంటారు అనుకున్నా వాళ్లే దారుణంగా కడతేరుస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి.


 ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ఏకంగా ఒకరినొకరు దారుణంగా హత్య చేసుకునేంత వరకు దారితీస్తున్నాయి.  భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరి కోసం బ్రతకాల్సింది పోయి ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు.  ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు విషయం ఉంటే అసలు నేటి రోజుల్లో భార్యాభర్తల బంధానికి ఎక్కడ విలువ లేదు అన్నది అర్ధమవుతుంది. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య భర్తల బంధం లో అనుమానం అనే పెనుభూతం దూరింది.



 ఇక భార్యపై అనుమానంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా ఐడియే బొల్లారం లో చోటుచేసుకుంది.  భార్యపై అనుమానంతో భార్య తో సహా అత్తను కూడా ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఐడియా బొల్లారం గాంధీనగర్కు చెందిన నూనె స్వరూప ఆమె తల్లి ఎల్లమ్మ అల్లుడు నరసింహ మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. తన భార్యపై అనుమానం పెంచుకున్న నరసింహ ఎప్పుడూ వేధిస్తూ ఉండేవారు ఇక ఇటీవలే ఏకంగా ఇక అత్తవారింటికి వెళ్లిన సదరు వ్యక్తి ఏకంగా భార్యతో పాటు అత్తను కూడా దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: