అలా అన్నాడని.. తండ్రిని చంపేసిన కొడుకు.. చివరికి..?
కనీసం జాలి దయ అనేది మరిచిపోతున్న మనుషులు రోజురోజుకు దారుణం గా వ్యవహరిస్తున్నారు. ఇక చివరికి ఏకంగా సొంత అన్న ని చంపడం లేదా తల్లిదండ్రులను కిరాతకంగా హత్య చేయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చి అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో రక్తం పంచుకుని పుట్టిన బిడ్డల విషయంలో కనికరం లేకుండా మారిపోతున్న తండ్రులు.. ఇక కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల విషయంలో ఉన్మాదులు గా మారిపోతున్న కొడుకులు ఇలా మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు కు విలువ లేదు అని అర్థమవుతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చిన సంచలన గా మారిపోయింది.
ఏకంగా చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచిన తండ్రి విషయంలో కాస్త అయినా జాలి చూపించలేకపోయాడు ఆ కొడుకు. చివరికి దారుణంగా తండ్రిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా పాములపహడ్ లో వెలుగులోకి వచ్చింది. ఎల్లయ్య అనే 45 ఏళ్ల రైతు కుమారుడు నాగేంద్ర మిర్యాలగూడలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల కరోనా వైరస్ కారణంగా పరీక్షలు నిలిచిపోవడంతో ఇంటిదగ్గర ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఏదో ఒక పని చేసుకోవాలి అంటూ ఇటీవలే నాగేందర్ ను మందలించాడు తండ్రి. ఈ క్రమంలోని ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది క్షణికావేశంలో నాగేందర్ కత్తెరతో తండ్రి గొంతు పై దాడి చేయగా ఇక అక్కడికక్కడే చనిపోయాడు ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.