వార్నీ... సినిమా పిచ్చితో గొంతు కోసుకున్న యువకుడు..చివరికి..!

MADDIBOINA AJAY KUMAR
సినిమాల్లో ఛాన్స్ కావాలంటే ఏదైనా యాక్టింగ్ స్కూల్ కు వెళ్లి నటనలో మెళకువలు నేర్చుకోవాలి. అవశాలు వచ్చినప్పుడు వెళ్లి ఆడిషన్స్ ఇవ్వాలి. అవకాశాల కోసం డైరెక్టర్ లు నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరగాలి. అలా చేస్తే ఎవరో ఒకరు టాలెంట్ నీ గుర్తించి ఛాన్స్ ఇస్తారు. కానీ సినిమా అవకాశం కోసం ఓ యువకుడు ఏకంగా గొంతు కోసుకున్నాడు. అంతే కాకుండా దాన్ని వీడియో తీసి తన తమ్ముడికి వాట్సప్ లో పంపించాడు. అంతే కాకుండా ఆ వీడియో ను వైరల్ చేయాలని తమ్ముడికి చెప్పాడు. చివరికి విషయం పోలీసులకు తెలియడం తో కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...కాంచీపురం జిల్లా సుంగువాసత్రం సంతవేలూరు గ్రామానికి చెందిన  శంకరలింగం కుమారుడు కుమారుడు మారిముత్తు. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా తిరువాళ్లూరు జిల్లాలోని కాకలూరు గ్రామం లో నివాసం ఉంటున్నాడు. అయితే మారిముత్తు శుక్రవారం ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు .

వచ్చిన తరవాత తలుపులు మూసుకునే ఉన్నాడు . శనివారం ఉదయం 10 గంటలు దాటుతున్నా ఇంటి నుండి భయటకు రాలేదు. పక్కింట్లో ఉండే వారికి రక్తం వాసన రావడంతో అనుమానం వచ్చింది. తలుపులు తట్టినా మారిముత్తు తియ్యకపోవడం తో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రక్తం మడుగులో పడి ఉన్న మారిముత్తు ను చూసి చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు . చికిత్స అనంతరం కోలుకున్న అతడిని ప్రశ్నించగా. .. కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే సినిమాల్లో అవకాశాలు వస్తాయని తన తమ్ముడు చెప్పాడని. .అందుకే ప్రాణం పోకుండా గొంతు కోసుకున్నానని చెప్పాడు . ఆ వీడియో తన తమ్ముడికి పంపించి సోషల్ మీడియాలో వైరల్ చేయాలని కోరినట్టు వెల్లడించాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: