పుట్టింట్లో ఉన్న భార్య కోసం వచ్చిన భర్త.. తలుపు తీయకపోవటంతో కిటికీలోంచి చూసి షాక్..?
అప్పటికే పేదరికంలో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సదరు మహిళ కి డబ్బులు ఇచ్చే స్తోమత లేకపోవడంతో చివరికి కఠిన నిర్ణయం తీసుకుని అమ్మ అమ్మమ్మ తో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా లవనూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మి అనే యువతికి ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి తో పెళ్లి జరిగింది ఈ క్రమంలోనే ఇక పెళ్లి చేసుకుని తమ కూతురు ఎంతో హ్యాపీగా ఉంది అని అనుకున్నారు కుటుంబీకులు. అయితే పెళ్లయిన కొద్ది రోజుల నుంచి భార్యను భర్త ముత్తు కుమార్ వేధించడం మొదలుపెట్టాడు అదనపు కట్నం ఇవ్వాలి అని హింసించేవాడు
రోజురోజుకు భర్త వరకట్న వేధింపులు ఎక్కువ అవుతున్న తరుణంలో చివరికి భర్త వేధింపులు తాళలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది ఈ క్రమంలోనే ఇటీవల తన భార్యకు ఫోన్ చేశాడు భర్త. తాను ఇంటికి వస్తున్నానని డబ్బులు సిద్ధంగా ఉంచాలి అంటూ బెదిరించాడు డబ్బులు ఇవ్వకపోతే మీ అంతు చూస్తాను అంటూ భయబ్రాంతులకు గురి చేశాడు ఈ క్రమంలోనే ఇటీవలే తన భార్య ఇంటికి వెళ్ళాడు భర్త ముత్తు కుమార్.తలుపు తట్టిన ఎన్నిసార్లు పిలిచినా ఎవరు తీయలేదు దీంతో కిటికీలోంచి చూస్తే ముగ్గురు మృతదేహాలు కనిపించాయి దీంతో ఒక్కసారిగా షాకయ్యాడు ఈ విషయాన్ని గ్రహించి అక్కడి నుంచి పరారయ్యాడు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.