కాల్చేశారు.. కాజేశారు.. చివరికి దొరికేసారు..?

praveen
నిన్న హైదరాబాద్ నగరం లో కాల్పుల ఘటన ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది అన్న విషయం తెలిసిందే. కూకట్పల్లి ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. కూకట్పల్లి లోని పటేల్ కుంట లోని హెచ్డిఎఫ్సి ఎటిఎం లో సిబ్బంది డబ్బులు రీఫిల్ చేస్తున్న సమయం లో నిందితులు ఒక్కసారిగా దూసుకు వచ్చి కాల్పులు జరిపారు. సిబ్బంది అప్రమత్తమై అయ్యేలోపే కాల్పులు జరిపి ఐదు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. ఇక ఈ కాల్పుల్లో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.



 అయితే కూకట్పల్లి లో కాల్పుల ఘటనను అటు పోలీసులు ఎంతో సవాల్గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే  విచారణ జరిపి కాల్పులు జరిపిన దుండగులను అనతి కాలంలోనే పట్టుకున్నారు పోలీసులు. ఇక ఏటీఎంలో డబ్బులు రిఫిల్ చేస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు అన్న సమాచారాన్ని అందు కోగానే అప్రమత్తమైన పోలీసులు శరవేగంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  అప్పటికే నిందితులు అక్కడి నుంచి పరార్ కావడంతో ఇక సీపీ సజ్జనార్ ఆదేశాల పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నట్లు తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే కూకట్పల్లి హెచ్డిఎఫ్సి ఎటిఎం దగ్గర కాల్పులు జరిపిన దుండగు లను  ఇక స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు పోలీసులు. ఇక సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా తీసుకొని దొంగలు ఎటువైపు వెళ్లారు అన్న విషయాన్ని గుర్తించి పట్టుకున్నారు. కాల్పులు జరిపి డబ్బులు దోచుకునీ దుండగులు వెళ్తున్న బైక్ కూకట్పల్లి నుంచి సంగారెడ్డి నాందేడ్ వెళ్తున్న సమయంలో ఇక ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు పోలీసులు. అయితే ఇద్దరు దుండగులు కూడా గత 15 రోజుల క్రితమే జీడిమెట్ల లో బ్యాంకు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: