లాడ్జికి రా అంటే ఒకే అన్న యువతీ.. కానీ రూమ్ లోకి వెళ్లి షాకైన యువకుడు?

praveen
కామంతో ఊగిపోయిన ఓ యువకుడు యువతిపై కన్నేశాడు  ఈ క్రమంలోనే ఆ యువతి ఫోన్ నెంబర్ సాధించి ఇక ఊరికే  యువతికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా లాడ్జికి రావాలని తన కోరిక తీర్చాలి అంటు మానసిక వేధింపులకు పాల్పడటం మొదలుపెట్టాడు.  అయితే రోజురోజుకు ఆ యువకుడి వేధింపులు ఎక్కువ కావడంతో చివరికి ఆ యువతి ఈ విషయాన్ని అన్నదమ్ములకు చెప్పింది  దీంతో చిర్రెత్తిన ఆమె అన్నదమ్ములు పక్కా ప్లాన్ ప్రకారం యువకుడిపై దాడి చేశారు. లాడ్జి కి వస్తాను కోరిక తీరుస్తాను అంటూ ఆ యువతి తోనే యువకుడికి ఫోన్ చేయించి ఆశ కల్పించారు.



 ఈ క్రమంలోనే ఆ యువకుడు నిజంగానే యువతి ఫోన్ చేసింది అనుకొని మురిసిపోయాడు. ఈ క్రమంలోనే ఇక చెప్పిన ప్లేస్ కి ఎంతో ఆనందంగా వెళ్ళి పోయాడు. కానీ ఇక రూమ్ లోకి వెళ్లగానే ఊహించని షాక్ తగిలింది. అక్కడ ఆ యువతి కి బదులు ఆమె సోదరుడు ఉన్నాడు. దీంతో ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో వెలుగులోకి వచ్చింది. మదనపల్లె టౌన్ లో ఉండే మైనర్ బాలుడు రామారావు కాలనీ లో ఉండే యువతికి తరచు ఫోన్ చేస్తూ వేధింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు.


 యువకుడి తీరుతో భయపడిపోయిన బాలిక ఈ విషయాన్ని ఆమె సోదరులకు చెప్పింది. ఇక పక్కా ప్లాన్ ప్రకారమే యువతితో ఆ యువకుడికి ఫోన్ చేయించారు.  లాడ్జి కి రావాలి అంటూ పిలిపించారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇక ఆ యువతి సోదరుడితో పాటు అతని స్నేహితులు అందరూ కూడా మూకుమ్మడిగా మైనర్ బాలుడిపై దాడి చేశారు.  దారుణంగా చితకబాదారు. అంతేకాకుండా ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయడంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది. స్థానికంగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: