అత్యాచారం కేసు.. 33ఏళ్ళ విచారణ.. చివరికి మహిళకు శిక్ష.?
ఆడపిల్ల అర్ధరాత్రి నడిరోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి అసలు సిసలైన స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీజీ తెలిపారు.. కానీ నేటి రోజుల్లో మాత్రం అర్ధరాత్రి కాదు కదా పట్టపగలే నడిరోడ్డుపై ఆడది ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది. ఇక ఈ మధ్య కాలంలో అయితే కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు చేయడమే కాదు దారుణంగా ప్రాణాలు సైతం తీసేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో న్యాయస్థానాలు సైతం అత్యాచారాల కేసుల్లో కఠినమైన శిక్షలు విధిస్తున్నాయి. ఇక ఇటీవల 33 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో ఓ మహిళకు కఠిన శిక్ష పడింది.
ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తిలో 33 ఏళ్ల క్రితం 12 ఏళ్ల మైనర్ బాలికపై దారుణంగా అత్యాచారం జరిగింది. అయితే ఐదుగురు కామాంధులు మైనర్ బాలికపై అత్యాచారం చేసేందుకు ఓ మహిళ సహకరించినట్లు విచారణలో తేలింది. అయితే ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు కూడా విచారణ జరుగుతున్న సమయంలోనే చనిపోయారు. అంతేకాదు మరో నిందితురాలి కి 15 వేల జరిమానా విధించింది కోర్టు. దాదాపు 33 ఏళ్ల పాటు దీనికి సంబంధించిన విచారణ శ్రావస్తి కోర్టులో జరుగగా.. ఇక ఇటీవల అత్యాచారానికి సహకరించిన మహిళలకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది.