వైద్యో నారాయణో 'హరీ'..

Satvika
కరోనా అత్యంత వేగంగా ప్రబలుతోంది.. ఈ క్రమంలో ఎవరూ ఉంటారో.. ఎవరూ పోతారొ ఎవరికీ తెలియదు.. కాని మనుషులకు మాత్రం డబ్బు పిచ్చి తగ్గలేదు.కరోనా మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే.. మరోవైపు కొన్ని ఆస్పత్రులు మాత్రం ఆర్థిక దోపిడీకి పాల్పడుతన్నాయి. కరోనా బారినపడి ప్రాణభయంతో వస్తున్న బాధితులను ఆర్థికంగా దోచుకుంటున్నాయి. అయితే, బాధితుల ప్రాణాలు పోయినా.. వారి నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటం శోచనీయం.

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఇలాంటి అమానుష ఘటన వెలుగు లోకి వచ్చింది.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎర్ణం శ్రీధర్(38) కరోనా బారినపడ్డారు. తీవ్రత పెరగడంతో హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆయుష్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో మే 5న చేర్పించారు. అప్పటి నుంచి రోజుకు రూ. 85వేల ఫీజు చొప్పున మే 16 వరకు చెల్లించామని, ఇక మందుల కోసం మరో రూ. 20వేల చొప్పున చెల్లించామని బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు..

అయిన కూడా అతని ప్రాణాలను ఆసుపత్రి సిబ్బంది కాపాడలేదు..10 లక్షలపైనే బిల్లు కట్టినా.. ఇప్పుడు ఇంకా రూ. 3.5 లక్షలు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. రెండు రెమిడిసివిర్ ఇంజెక్షన్లకు ఒక్కొక్కటి రూ. 50వేల చొప్పున, ప్లాస్మాకు రూ. 30వేలు ఆస్పత్రి యాజమాన్యం వసూలు చేసిందని చెప్పారు.. దీంతో మృతుని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఈ విషయం పై ఆసుపత్రి సిబ్బంది స్పందిస్తూ.. తాము డబ్బుల కోసం వేధించలేదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనా నుంచి కోలుకుంటుండగా.. ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో శ్రీధర్ మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఏదో గొడవ జరుగుతోందని ఆస్పత్రి వద్దకు వచ్చామని కల్ల బోల్ల మాటలు చెప్పారు. ఈ ఘటన పై నిరసన కొనసాగుతుంది..ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు ఇలా చేయడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: