చనిపోయిన భర్త తో తిలకం పెట్టించి.. చివరికి..
యువజంట వివాహబంధం విషాదాంతమైంది. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతీయువకులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. దీన్ని అమ్మాయి తల్లి తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. మనస్తాపం చెందిన అబ్బాయి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ్‌బెంగాల్‌లోని బర్ధమాన్‌లో జరిగింది.
అసలు విషయానికొస్తే.. ఈ విషయం పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శవం వున్న స్థితిని పూర్తిగా వివరాలను సేకరిస్తున్నారు.. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరణోత్తర పరీక్షల అనంతరం శవాన్ని అప్పగించారు. అనంతరం కోపం తో రగిలిపోయిన యువకుడి తరఫు బంధువులు, కుటుంబ సభ్యులు యువతి ఇంటిని చుట్టుముట్టారు.చనిపోయే ముందు ఆ యువకుడు ఫొటోలు పంపినా.. కాపాడేందుకు ఆమె ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.
కనీసం తమకు సమాచారం ఇచ్చినా కాపాడుకునే వాళ్లమని వాపోయారు. ఆగ్రహం తో ఆ అమ్మాయి, ఆమె తల్లిపై దాడి చేశారు.తర్వాత బలవంతంగా ఆ యువతిని లాక్కొచ్చి నొసటన యువకుడి వేలి తో తిలకం దిద్దించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ఇది ఇలా ఉండగా యువతి తల్లి తమ పై దాడికి పాల్పడ్డారంటూ స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. ఆమె వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..