ఐసీయూలో ఉన్న యువతి పై అత్యాచారం.. సీసీ కెమారాలో..

Satvika
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలను అమలు చేస్తున్నా కూడా వారి పై దాడులు జరుగుతూనే వున్నాయి.. ఇప్పుడు కూడా మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐసీయూలో ఉన్న ఓ యువతి పై ఆసుపత్రి లోని వార్డు బాయ్ అతి దారుణంగా అత్యాచారం చేశాడు.. ఈ ఘటన తో రాష్ట్రం మొత్తం వెదెక్కింది.. వివరాల్లొకి వెళితే..ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మజీద్‌నగర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల బాలికకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు మే 27వ తేదీన కేర్ నర్సింగ్ హోమ్ లో చేర్పించారు.


అయితే వార్డు బాయ్ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తనకు డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేసినట్టు బాలిక ఆరోపించారు. అయితే అక్కడ విషం ఎక్కిస్తానని బెదిరించారు.వార్డు బాయ్ బెదిరింపులకు భయపడిపోయిన యువతి తీవ్ర మనోవేదన అనుభవించింది. అయితే ధైర్యం తెచ్చుకుని ఈ విషయాన్ని ఆమె తన సోదరుడి భార్యకు వివరించి.. కన్నీరు పెట్టుకుంది.. యువతి కుటుంబ సభ్యులు లిసారీ గేట్ పోలీస్ స్టేషన్‌లో ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేశారు.


ఈ ఘటన గురించి యువతి కుటుంబ సభ్యులకు తెలిపిన తర్వాత.. ఆమె కజిన్ ఒకరు ఆస్పత్రి వద్దకు వెళ్లారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో నిందితుడు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పేషెంట్‌ను వేధిస్తున్నట్టుగా ఉంది. ఆ తర్వాత అనుమానం కలిగించే విధంగా సీసీటీవీ కెమెరాలు 40 నిమిషాల్ ఆఫ్ చేయబడ్డాయి.సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేయించి ఉంటాడని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.అనంతరం పోలీసులు నిందితుడిని ఖార్ఖౌడాలోని ఘోసిపూర్ గ్రామానికి చెందిన ఖాసీమ్‌గా గుర్తించారు. నిందితుడిని పోలీసులు ప్రశ్నించారు... ఈ దారుణ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: