వీడు మామూలోడు కాదు.. 2వేల నోటు కలర్ జిరాక్స్ తీసి?
ఇక్కడ మాత్రం వెలుగులోకి వచ్చిన ఘటన అటు పోలీసులను సైతం షాక్ కు గురిచేస్తుంది. ఒక వ్యక్తి రెండు వేల నోట్లను నకిలీ తయారు చేయటం మొదలు పెట్టాడు. ఇక మొదట్లో కేవలం కొన్ని నోట్లు మాత్రమే తయారు చేసాడు సదరు కేటుగాడు ఆ తర్వాత దొంగ 2000 నోట్లు ఎక్కువగా ప్రింట్ చేయడం మొదలుపెట్టాడు. కాని చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో చోటు చేసుకుంది. 2000 రూపాయల దొంగనోట్లు తయారుచేస్తున్న రాజు ప్రసాద్ అనే వ్యక్తి ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.
అతని దగ్గర నుంచి ఆరు రెండు వేల రూపాయలు నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేటుగాడు కలర్ జిరాక్స్ మిషన్ ఉపయోగించి భారీగా 2వేల రూపాయలు నకిలీ నోట్లను తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నకిలీ నోట్లను చలామణి చేసినట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఇప్పుడే కాదు గతంలో కూడా ఐదు పోలీస్ స్టేషన్లో ఇలా నకిలీ నోట్లు చలామణి చేస్తూ పట్టుబడిన ట్లు పోలీసులు గుర్తించారు. ఇక అతన్ని కస్టడీకి తరలించారు పోలీసులు. అయితే ఇది కాస్తా స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా కలర్ జిరాక్స్ మిషన్ ఉపయోగించి దొంగ నోట్లు తయారు చేయడంతో అందరూ అవాక్కయ్యారు.