ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం ఎక్కువ.. మానసికం గానే కాకుండా శారీరకంగా కూడా లోబరుచుకుంటున్నారు. అది కేవలం కొన్ని రాష్ట్రాల కే పరిమితం అయ్యింది. నార్త్ ఇండియా రాష్టాల లో మాత్రం ప్రేమించి, అమ్మాయిని శారీరకం గా వాడుకోని పెళ్లి విషయం రాగానే మొహం చాటేస్తున్నారు. లేదా బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు. ఒకవేళ అందుకు ఒప్పుకోకుంటే మాత్రం దారుణాల కు ఒడిగడుతున్నారు.
అది లేకుంటే ప్రాణాల ను కూడా తీస్తున్నారు. తాజాగా గుజరాత్ లో మరో ఘటన వెలుగు చూసింది. వడోదర కు చెందిన 26 ఏళ్ళ సమీర్ ఖురేషీ 2019లో ఇన్‌స్టాగ్రామ్ లో ఒక యువతి ని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరిది ఒకే కులం అని చెప్పడం తో అమ్మాయి నమ్మింది. అది అదునుగా భావించిన అతను ప్రేమలో దింపాడు. ఆ ప్రేమ కాస్త శారీరకం గా దగ్గర అయ్యేలా చేసాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. దాంతో అతను బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఇద్దరు కలిసి తిరిగిన ఫోటోల ను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు.
రెండుసార్లు బాధితురాలు గర్భం దాల్చగా, నిందితుడు అబార్షన్ చేయించాడు. ఈ విషయంపై సదరు యువతి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే అతను పెళ్లి చేసుకోవాలని ఆమెని తన మతం లోకి మార్చాలని అనుకున్నాడు. క్రెస్తవ మతం లోకి కాకుండా నిఖాను ఏర్పాటు చేసాడు. తర్వాత అతని పేరు కూడా మార్చుకున్నాడు. ఆమె పేరును కూడా మార్చినట్లు బాధితురాలు ఫిర్యాదు లో పేర్కొన్నారు. నిందితుడి ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. మత మార్పిడి చేసే ప్రయత్నం చేసాడనే ఆరోపణలు ఉండటంతో కేసు మరింత బలంగా మారింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.