మూడో పెళ్లి కావాలంటే 'అది' కోసేసింది..
భార్య ఉండగా మరో ఆడదానివైపు కన్నెత్తి చూసిన కూడా ఒప్పుకోవడం లేదు. బెదిరించడం మాట పక్కన పెడితే.. నిర్దాక్షణంగా చంపేస్తున్న ఘటనలు దేశంలో వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు వెలుగు చూసిన ఘటన వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మూడో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్న భర్త మర్మంగాన్ని కోసి, ఆపై దారుణంగా చంపేసింది ఓ ఇల్లాలు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే .. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. తన భర్త పెట్టే హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ముందు వాపోయింది. భౌరా ఖుర్ద్ గ్రామ మసీదులో మౌల్వీగా అతడు బాధ్యతలు నిర్వర్తించేవాడు. అయితే అతనికి రెండు పెళ్లిళ్లు అయ్యినట్లు విచారణలో వెల్లడైంది. అయితే రోజూ తాగొచ్చి భార్యను కొట్టేవాడు. బాగా హింసించేవాడు. రోజు భరించేది. అతని ఆగడాలు శృతి మించాయి. దాంతో తాను మూడో పెళ్లి కూడా చేసుకుంటానని అన్నాడు.
ఇక కోపం పట్టలేని భార్య పక్కనే ఉన్న కొడవలితో మొదటగా అతని మర్మాంగాన్ని కోసి చేతికి ఇచ్చింది. ఆ తర్వాత గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. మొదటగా అనుమానాస్పద మృతిగా పరిగణించిన పోలీసులు.. లోతుగా విచారణ జరిపారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె అదుపులోకి తీసుకోని విచారణ జరుపుతున్నారు. మృతునికి ఆమె రెండో భార్య.. వీరిద్దరికి ఐదుగురు కుమార్తెలు కూడా ఉన్నారు.