కోడలిపై మామ అత్యాచారం.. భర్తకు నిజం చెప్పిన భార్య.. కానీ..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ మీరట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. ఇక ఆమె భర్త.. అబిద్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తుండు. అయితే అబిద్ తండ్రి నజీర్ అహ్మద్ కూడా రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో ఉన్నారు. ఇక నజీర్ ఘాజియాబాద్‌లో పోస్టింగ్‌లో ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మామ.. తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా మహిళా కానిస్టేబుల్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అంతేకాదు.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్టుగా వెల్లడించింది. ఆమె ధైర్యం చేసి ఈ విషయం తన భర్తకు చెబితే.. అతడు నిషేధిత ట్రిపుల్ తలాక్ చెప్పి తనకు విడాకులు ఇచ్చినట్టు పేర్కొన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అబిద్‌తో తనకు మూడేళ్ల క్రితం వివాహం జరిగిందని.. అప్పటి నుంచి అత్తింటివారు తనను అదనం కట్నం కోసం వేధిస్తున్నారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీ వినీత్ భట్నాగర్ ఈ ఘటనపై స్పందించారు. ఇక నిందితుడు నజీర్, అతడి కుమారుడు అబిద్‌లపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.