సూపారి ఇచ్చి కన్న కొడుకును చంపించిన తల్లి.. ఎందుకో తెలుసా?
సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన అనంతపురం జిల్లాలో కదిరి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. కంచుకోట లోని బాల్ వీధికి చెందిన బాల సుబ్బలక్ష్మి కొన్నేళ్ల కిందటే భర్త చనిపోవడంతో శ్రీనివాసులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధానికి తెరలేపింది . ఇక ఈ విషయం బాల చిన్న అనే 24 ఏళ్ల కొడుకుకు తెలియడంతో తరచుగా ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతు ఉండేది. ఇక తల్లి తీరుతో విసిగి పోయిన కొడుకు మద్యానికి బానిస గా మారిపోయాడు. ఇక తీరు మార్చుకోవాలంటూ తరచూ తల్లికి సూచిస్తూ ఉండేవాడు. అయితే కొడుకు కంటే ప్రియుడితో సుఖమే కావాలి అనుకుంది ఆ తల్లి. ఈ క్రమంలోనే ఇక కన్న కొడుకునీ సుపారీ ఇచ్చి మరి హత్య చేసేందుకు ప్లాన్ చేసింది.
పక్కా ప్లాన్ ప్రకారం బాల చిన్న ను హత్య చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. ఇక ఇటీవల సుపారీ పుచ్చుకున్న నిందితులు సదరు యువకునితో మాటలు కలిపి పురుగుల మందు కలిపిన మద్యం తాగించారు. అపస్మారక స్థితిలోకి చేరుకోగానే తర్వాత కర్రతో బండరాయితో ముఖంపై తలపై కొట్టి చనిపోయాడు అని.. నిర్ధారించుకున్న తర్వాత పారిపోయారు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇక వాంగ్మూలం తీసుకుంటున్న సమయంలో తల్లి సుబ్బలక్ష్మి ఉండలేని సమాధానం చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇక నిందితులను తల్లి సుబ్బలక్ష్మి కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది.