తండ్రి కూతురికి బీరు తాగించాడు... తర్వాత ఏం చేశాడు..?

MOHAN BABU
 ఒక్కో తండ్రి  ఒక్కో విధంగా ఉంటారు. ఒక్కోసారి మనం ప్రేమతో చేసే పనులే  మనల్ని ఇబ్బంది పెడతాయి. వీరికి ఇలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదు. కానీ ఆ తండ్రి కూతురుకు బీరు తాగించాలనుకున్నాడు. గ్లాసులో బీర్ తాగించాడు. ఇలా ప్రేమతో చేసిన పని ఆయనకు కటకటాల పాలు చేసింది. చివరికి అమ్మాయిని హాస్పిటల్ పాల్చేసింది. ఆయనను జైలుపాలు చేసింది. ఈ పని చేసే ముందు అయినా అది చేయొచ్చా, లేదా అనేది కాస్త ఆలోచించి చేస్తే బాగుంటుంది. తన తండ్రి కూతురు పై ప్రేమ చూపించాను అనుకున్నాడు. కానీ చివరికి కథ అడ్డం తిరిగింది. అది ఏంటో చూద్దాం.

 కూతురిపై ప్రేమతో  తను తాగుతున్నా బీరులో కొంత  తన కూతురికి తాగించాడు. ఇలా ఏ తండ్రి అయినా ఉంటాడా అని మీరు అనుకోవచ్చు. కానీ నా కూతురు పై అమితమైన ప్రేమతో ఇలా చేశాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.  తండ్రులకు  కూతురు అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. వారు అడిగితే ఏదైనా కాదనలేకుండా ఇచ్చేస్తారు. ఇవన్నీ ప్రేమతో చేస్తూ ఉంటారు. చాక్లెట్లు, బిస్కెట్లు ఏవైనా వస్తువులు  ప్రేమతో కొలుస్తూ వుంటారు. కానీ ఓ తండ్రి చేసిన నిర్వాకం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేరళ రాష్ట్రం కాసర్గోడ్ జిల్లా హోస్ దుర్గు తోయమ్మూరు గ్రామంలో రాధాకృష్ణన్ కుటుంబం నివాసం ఉంటారు.  ఇతనికి ఎనిమిదేళ్ల కూతురు ఉన్నది. ఇతను ఒక రోజు బీరు తాగుతున్నాడు.  ఇదే సమయంలో కూతురు వస్తే  ఆమెకు కూడా బిరు తాగించాడు.


దీంతో సదరు బాలిక స్పృహ తప్పిపోయింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు బాలిక వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. తదనంతరం బాలిక తండ్రి రాధాకృష్ణన్ను అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా అతనికి రెండు వారాల జైలు శిక్ష కోర్టు విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: