ఆమె దొంగ ప్రేమ యువకుడి ప్రాణాలు తీసిందా..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దోమ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గత నెల జూన్ 29 న వినయ్ అనే యువకుడు 23 సంవత్సరాలు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వినయ్ కుటుంబ సభ్యులకు ఆత్మహత్య ఎందుకు చేసుకు న్నాడో అర్థం కాక పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే అంత్యక్రియలు చేసారు. తర్వాత అనుమానం వచ్చి యువకుడి యొక్క మొబైల్ ఫోన్ చెక్ చేశారు. అందులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి . వినయ్ కి ప్రేమ వ్యవహారం ఉన్నదని దాని వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులకు అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిజా నిజాలు బయటపెట్టారు. వినయ్ అదే గ్రామానికి చెందిన ఒక యువతితో గత కొద్ది రోజులుగా ప్రేమ వ్యవ హారం కొనసాగిస్తున్నాడు . అయితే వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోరని ఇరువురు ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క యువతి ఇద్దరం కలిసి చచ్చి పోదాం అంది. నేను పురుగుల మందు తాగుతున్నాను. నువ్వు కూడా తాగి చచ్చిపో అని యువ కుడితో ఫోన్ లో చాట్ చేసింది. ఆ యువతి దొంగ మాటలు నమ్మిన వినయ్ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వినయ్ మృతిచెందాడు.
వినయ్ ని నమ్మించి యువకుడు చనిపోయాక అతని అంత్యక్రియలు జరుగుతుంటే ఆ యువతి తన ఎంగేజ్మెంట్ ను జరుపుకుంటోంది. అంటే తన ప్రేమను నమ్మించి యువకుడిని లేకుండా చేసి వేరొకరితో పెళ్లి చేసుకుందామని, ప్లాన్ వేసిన యువతి ఇంత దారుణానికి ఒడిగట్టింది. వినయ్ తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు.