భార్యకు బర్త్ డే గిఫ్ట్.. దొంగగా మారిన భర్త.. చివరికి?
సాధారణంగా భార్య పుట్టినరోజు ని ఎంతో ఘనంగా జరపడానికి భర్తలు ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక భార్య పుట్టినరోజు నాడు ఆమెకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి సంతోష పరచాలి అని అనుకుంటూ ఉంటారు. చాలా మటుకు భర్తలు భార్య పుట్టినరోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక భర్త ఇలాంటి ప్లాన్ చేసాడు. ఏకంగా ఒక ఖరీదైన చీరను భార్య పుట్టినరోజు నాడు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడు. అయితే ఇలా బహుమతి ఇవ్వాలని అనుకోవడంలో తప్పు లేదు కానీ.. భార్యకు పుట్టినరోజు బహుమతి ఇచ్చేందుకు చివరికి దొంగతనం చేశాడు ఇక్కడ ఒక వ్యక్తి. చివరికి పోలీసులకు దొరికి కటకటాలపాలయ్యాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది భార్యకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేందుకు ఖరీదైన చీరను దొంగలించాడు భర్త. ఉజ్జయినిలోని చీరల దుకాణంలో రాత్రి సమయంలో చొరబడిన విక్కీ అనే దొంగ కత్తితో బెదిరించి ఖరీదైన చీరలు ఎత్తుకెళ్లాడు. అయితే అక్కడ సీసీటీవీలో అంతా రికార్డు అవుతుంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు. ఇక వెంటనే ఆ షాపింగ్ మాల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసిటివి ఫుటేజీ ఆధారంగా పరిశీలించిన పోలీసులు అతను పాత నేరస్తుడు అని గమనించి చివరికి అతన్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారు.