అక్రమ సంబంధం: నిద్రపోతున్న భర్తను లేపి మరీ..?

MOHAN BABU
అక్రమ సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. తెలిసో తెలియకనో ఇలా సంబంధాలు పెట్టుకొని తమ జీవితాలు చేతులారా పాడు చేసుకుంటున్నారు. కట్టుకున్న భర్తలను, భార్యను, కన్నవారిని  కూడా చంపేస్తున్నారు. అలాంటి అక్రమ   సంబంధమే తన భర్తను  చంపేలా  చేసింది. తన భర్తను కాదని  మరొక వ్యక్తితో  ఆమె అక్రమ  సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి  తన భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని అంతమొందించాలనుకుంది. తన ప్రియుడితో కలిసి తన భర్తను కిరాతకంగా చంపేసింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మాండ్యా లో చోటు చేసుకుంది.


 గుప్తల్ లేఅవుట్ ప్రాంతానికి చెందినటువంటి ఆఫ్టఫ్ మెహదీ  54 సంవత్సరాలు. తన భార్య సైదా రిజ్వాన్ తో కలిసి నివాసం ఉంటున్నారు. అఫ్తాప్ మండ్యలోని   పిజీ కాలేజీలో ప్రిన్సిపల్ గా చేస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సైదా రిజ్వాన్ సామాజిక మాధ్యమం  ద్వారా రహతుల్లా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.  దీంతో ఇద్దరూ రోజు చాటింగ్ చేసుకునేవారు. ఈ విధంగా సైదా అతనిపై విపరీతమైన ప్రేమను పెంచుతుంది. అతనికి డబ్బులు కూడా ఇచ్చి ఒక దుకాణం పెట్టింది. వీరి మధ్య నడుస్తున్న వివాహేతర సంబంధాన్ని తెలుసుకున్న ఆఫ్టఫ్ ఒకటి రెండు సార్లు తన భార్యను మందలించాడు. ఈ సంబంధం మంచిది కాదు అని చెప్పాడు. అయినా ఆమె వినలేదు. తన భర్త కోపానికి వస్తున్నాడని ఎలాగైనా అతన్ని హతమార్చాలి అనుకున్నది. రాత్రి సమయంలో అందరూ పడుకున్నాక తన ప్రియుడికి ఫోన్ చేసి రమ్మన్నది.

నిద్రపోతున్న అటువంటి ఆఫ్టఫ్ ను ఇరువురు కలిసి  గొంతు నులిమి గోరంగా హత్య చేశారు. తర్వాత ప్రియుడిని అక్కడ నుంచి  వెళ్లిపొమ్మని చెప్పింది. తర్వాత తన భర్త గుండెపోటుతో మరణించాడని చిత్రీకరించింది. ఉదయం అంత్యక్రియలు కూడా చేశారు. బంధువులకు కొద్దిగా అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా  నిజాలు బయటపడ్డాయి. వెంటనే ఇద్దర్ని అదుపులోకి తీసుకొని  జైలుకు పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: