ఆరేళ్ల బాలికను పశువుల కొట్టంలో.. ఆ కామాంధుడు.. ఆపై..?

MOHAN BABU
భారతదేశంలో ఆడపిల్లలపై హింస పెరిగిపోతున్నది. అది పోయిన ఏడాది కంటే ఈ ఏడాది కరోణ సమయంలో మరి ఎక్కువైందని జాతీయ మహిళా కమిషన్ ఒక ప్రకటనలో చెప్పింది. వాళ్లు చేసిన సర్వేలో  25% మహిళలపై హింస పెరిగిందని అన్నారు. అసలు హింస  ఎందుకు పెరిగిందో ఇలాంటి ఘటనలు చూస్తే అర్థమవుతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది దుర్మార్గులు చిన్న పెద్ద తేడా లేకుండా చివరికి ముసలి వాళ్ళని కూడా చూడకుండా కామవాంఛతో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు.
చిన్నారి బాలికలను టార్గెట్ చేసి మాయ మాటలు చెబుతూ అత్యాచారాలకు ఎగబడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకు దేశంలో కోకొల్లలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా ఈ కామందుల మనసులో మాత్రం  చీమకుట్టినట్టు కూడా అనిపించడంలేదు. ఈ ఆరేళ్ల బాలికపై ఆ వ్యక్తి పశువుల కొట్టంలోకి తీసుకెళ్లి ఏం చేశాడు. అది ఎక్కడో.. చూద్దాం.? ఆరేళ్ల బాలికపై ఈ కామ పిచాచి తన కామ వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. అయితే  సదరు బాలిక ఇంటిముందు ఆడుకుంటుండగా పశువుల కొట్టం తీసుకెళ్లి ఈ ఘటనకు పాల్పడి చివరికి జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని  చిన్నాపురం గ్రామంలో  ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ధనుంజయ్ రెడ్డి అనే యువకుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని కొద్ది దూరంలో ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకెళ్ళాడు. ఆపై సదరు బాలికపై లైంగిక దాడి చేసాడు.
 దీంతో ఆ బాలికకు తీవ్రమైన రక్తస్రావం కావడంతో ఏడుస్తూ వచ్చి తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు చికిత్సకోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేపట్టి  నేరం చేసిన అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి దుర్మార్గులకు మరణశిక్ష వేయడమే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: