ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..!!

N.ANJI
వివాహేతర సంబంధాలతో కాపురాల్లో చిచ్చు పెట్టుకున్నారు. తాజగా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను అంతమొందించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై సిటిలోని ఎన్నోర్ అపార్ట్ మెంట్స్ ప్రాంతంలో జ్యోతి నివాసం ఉంటుంది. ఆమె అదే ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ లో పని చేస్తుంది. అయితే కరుప్పస్వామి (30) అనే యువకుడు అదే రెస్టారెంట్ లో చేరారు. ఓకే రెస్టారెంట్ లో పని చేస్తుండటంతో వారి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

ఇక జ్యోతికి ఒక కూతురు ఉంది. అయితే తల్లితో రెస్టారెంట్ కు వస్తున్న కూతురును చూసి కురుప్పస్వామి ప్రేమలో పడ్డాడు. జ్యోతితో మీ కూతురును పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఆమె 16 సంవత్సరాలు అని జ్యోతి చెప్పడంతో పర్వాలేదు నేను పెళ్లి చేసుకుంటానని కరుప్పస్వామి చెప్పాడు. కురుప్పస్వామి పెళ్లి కట్నం తీసుకోకుండానే తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం కావడంతో జ్యోతి కూడా ఒకే చెప్పింది. అయితే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని జ్యోతికి ఆమె కూతురు తెలిపింది.

అయితే కుమార్తెకి ఇష్టం లేకపోయినా తల్లి జ్యోతి బలవంతంగా కరుప్పస్వామితో మూడు నెలల క్రితం వివాహం చేసింది. ఇక మూడు నెలలు కాపురం చేసిన తర్వాత ఆమె భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చేసింది. కరుప్పస్వామి తన భార్యను ఎలాగైనా కాపురానికి పిలుచుకుని అత్తారింటికి వెళ్ళాడు. అయితే పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగుతుండగా ఓ రోజు తన భార్య, ప్రేమికుడు కలిసి ప్లాన్ చేసి అతడిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు రంగంలోకి దిగి కరుప్పస్వామి భార్య, ఆమె ప్రియుడుని అదుపులోకి తీసుకున్నారు.

ఇక పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. అయితే 10వ తరగతి చదువుతున్న సమయంలోనే  జ్యోతి కూతురు, వసంత్ కుమార్ ప్రేమించుకున్నారు. ఇక ఇద్దరు ఇంటి నుంచి పారిపోయి మూడు నెలలు కాపురం చేశారని తెలిపారు. ఆ తరువాత జ్యోతి ఆమె కూతురిని పట్టుకుని ఇంటికి పిలుచుకుని కరుప్పస్వామితో వివాహం చేసిందన్నారు. ఇక పెళ్లి చేసుకున్న తరువాత కూడా జ్యోతి కూతురు వసంత్ కుమార్ తో అక్రమ సంబంధం సాగించిందని తెలిపారు. భర్తను చంపేసి ప్రియుడు వసంత్ కుమార్ తో కలిసి ఉండాలని స్కేచ్ వేసిందని విచారణలో వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: