తల్లిని చంపి గుండెని కోసిన కిరాతకుడికు ఏ శిక్ష వేయాలి చెప్పండి.. !!

Suma Kallamadi
రాను రాను మనుషులు అడవిలో ఉండే మృగాలా కంటే నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. అనుబంధాలు, ఆప్యాయతలు మరిచిపోయి క్రూరంగా తయారయ్యారు అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ దారుణమైన ఘటనతో ఒక్కసారిగా సభ్యసమాజం ముగ పోయింది. ఒళ్లు గగుర్పొడిచేలా అత్యంత కిరాతకంగా కన్న తల్లిని చంపిన ఘటనలో కోర్టు కనివిని తీర్పును ఇచ్చింది. కన్న తల్లి అని కూడా చూడకుండా  చంపిన కొడుకుకి మరణ శిక్ష విధించమని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అతను చనిపోయే వరకు ఉరి తీయమని కోర్టు తీర్పును ఇచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అది కూడా ఇప్పుడు కాదు ఇది జరిగింది దాదాపు నాలుగు సంవత్సరాలు దాటుతుంది కూడా. 2017 సంవత్సరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
2017 ఆగస్టులో సునీల్ రామ కుచ్కోరవి అనే వ్యక్తి  అతని తల్లిని దారుణంగా  హత్య చేశాడు.అనుకోకుండా ఓ పిల్లవాడు అటు వైపు వెళ్తూ రక్తపు మరకలతో ఉన్న శవాన్ని చూసి బిగ్గరగా ఏడ్చాడు. పిల్లాడు ఏడుపులకు అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ దృశ్యాలను చూసి అందరూ షాక్ తిన్నారు. అసలు ఇతను మనిషేనా అని అనుకున్నారు అందరు. అలాగే అక్కడ దృశ్యం చూసి పోలీస్ ఇన్స్ పెక్టర్ భూసాహెబ్ షాక్ అయ్యారు.రక్తపు మడుగులో ఉన్న మృతదేహం చూసి ఆశ్చర్య పోయారు. ఆమెను చంపేసి గుండె తీసేసి ఓ ప్లేట్ లో పెట్టాడు. అలాగే మరికొన్ని అవయవాలు అక్కడున్న పొయ్యిలో కాలుతూ ఉండడంతో అందరూ భయపడిపోయారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్ లోకల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగింది. కనీసం తల్లి అని కూడా చూడకుండా ఇంత కర్కటంగా చంపడంతో అతన్ని  అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనపై జడ్జి మహేష్ కృష్ణజీ జాదవ్ ఈరోజు తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసారు.ఇది ఒక హత్యే కాదు, కరడుగట్టిన క్రూరత్వంగా పరిగణించవచ్చు. మద్యానికి బానిసై నేరానికి పాల్పడ్డాడని,తల్లిని చంపిన తరువాత కూడా నిందితుడిలో కనీసం పశ్చాతాపం కనబడడం లేదని తెలిపారు. చనిపోయిన ఆమె బాధను మాటలో చెప్పలేమని,అందుకే  నిందితుడిని మృతి చెందే వరకు క్రూరాతి క్రూరంగా ఉరి తీయాలని ఆదేశించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: