కూతురు అమ్మ మాట వింటే చంపేస్తారా.?
పెళ్ళికి ముందు ఈ విషయాన్నీ దాచి పెళ్లి చేసారు. పెళ్లయ్యాక భర్త తాగుడు అలవాటు గురించి తెలిసి భర్తని ప్రశ్నించగా తాగుడు అలవాటు అనేది భూమ్మీద ఎవరికీ లేదు. ఇప్పుడు అందరూ తాగుతారు.దాన్ని పెద్ద సీన్ చేయకుండా చూసి చూడనట్లు ఉండు అని భార్యకి వార్నింగ్ ఇచ్చాడు.కానీ భర్త ప్రవర్తన నచ్చని భార్య ఎలాగైనా భర్తకు మద్యం అలవాటు మాన్పించాలి అనుకుని ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో తల్లి చెప్పిన సలహాలు విని వాటిని భర్త మీద ప్రయోగించేది ఇలా చాలాసార్లు చేస్తుండటంతో కోపం వచ్చిన భర్త అసలు నీ తల్లితో ఫోన్‌లో మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. కానీ కూతురు భర్త మాట వినకుండామళ్ళీ అమ్మతో మాట్లాడుతుందని విసిగిపోయిన భర్త అత్త మీద కోపం పెంచుకున్నాడు.
రాను రాను అత్త మీద కోపంతో ఇంకా తాగుడు ఎక్కువ అయిపొయింది. తాగిన మత్తులో అత్త ఇంటికి వెళ్లాడు.కోపముతో ఓ రాడ్డుతో అత్త తల మీద బలంగా కొట్టాడు.ఒక్కరితో ఆగకుండా చాలాసార్లు రాడ్డుతో తల పై కొట్టాడు. ఆమె అరుపులతో చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చారు. వాళ్లను చూసి అల్లుడు పారిపోయాడు.అత్తని హాస్పిటల్ లో జాయిన్ చేసే లోపే చనిపోయింది. అత్తారింట్లో ఉన్న కూతురు తల్లితో మాట్లాడడమే తప్పు అయిపోయింది.తాగొద్దు అని చెప్పినందుకు అత్తను చంపేశాడు ఈ ప్రబుద్దుడు. సాదర్ బిలాస్‌పూర్ డిఎస్పీ రాజ్ కుమార్... ఈ కేసును సీరియస్‌గా తీసుకునీ నిందితుడు కోసం గాలిస్తున్నారు. !