విధి వక్రీకరించింది, తను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎంతోమందికి తన సేవలందించాడు. ఎవరినైనా ఒక పోలీస్ అధికారిగా కాకుండా ప్రతి ఒక్కరితో మాట కలిపి ఆప్యాయంగా మాట్లాడేవారు. తను ఉన్నన్ని రోజులు పోలీస్ శాఖలో నిస్వార్థ సేవలందించిన సేవా పరుడు ఈయన. విధి వక్రీకరించడంతో చివరికి బావిలో పడి మరణించాడు. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే అతని కారు బావిలో పడి మునిగిపోవడంతో, దాన్ని తీసేందుకు మరో అధికారి అయిన ఫైర్ ఇంజన్ వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. చివరికి బావి లోంచి కార్ బయటికి తీశారు. ఆ కారులో ఉన్న మృతదేహాన్ని చూసి సరికి ఫైర్ ఇంజన్ అధికారి షాక్ అయ్యాడు. అందులో పడింది తన సోదరుడు అని కుప్ప కూలిపోయాడు. అంటే తెలియకుండానే అన్న మృతదేహాన్ని ఆయన బయటకు తీసి చివరికి ఆవేదన వ్యక్తం చేశాడు.
వివరాల్లోకి వెళితే ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామ సమీపంలో కొత్తపల్లి నుంచి ఉస్నాబాద్ వచ్చే రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ ఎస్ఐ పాపయ్య నాయక్ ఒక్కరే తన కారు నడుపుకుంటూ కరీంనగర్ నుంచి వస్తున్న క్రమంలో కొత్తపల్లి దగ్గర, కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకుపోయింది. దీంతో అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దాదాపు 10 గంటల శ్రమించారు. గజ ఈతగాళ్లను, ఫైర్ సిబ్బంది తెప్పించి అందులో నుంచి నీళ్ళు తోడే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజన్ సాయంతో తీవ్రంగా శ్రమించారు. నీరు ఎక్కువగా ఉండడంతో కారును తొందరగా బయటకు తీయలేకపోయారు.
మోటార్లు అమర్చి అందులోని నీటిని బయటకు తోడారు. ఈ ప్రమాద ఘటనలో పాల్గొన్న టువంటి ఫైర్ ఆఫీసర్ భూదయ్య కార్ అందులో పడినప్పటినుంచి వెలికితీత పనుల్లో నిమగ్నమైపోయాడు. చివరికి కారును బయటకు తీసి శవాన్ని బయట వేసేసరికి అది చూసిన బుదయ్య ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. అందులో ఉన్నది తన సోదరుడు మృతదేహామే అని చూసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతసేపు నా సోదరి మృతదేహం తీయడం కోసమేనా నేను ఇప్పటివరకు ఉన్నది అని బోరున విలపించాడు. దీంతో అక్కడున్నవారంతా ఆవేదన వ్యక్తం చేశారు.