అన్నదాత ఊపిరి ఆగింది..కారణం ఏమిటంటే..?

Suma Kallamadi
అన్నదాతకు అడుగడుగునా గండాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ప్రకృతి సహకరించక అన్నదాత ఎన్నో నష్టాల్లో కూరుకు పోతున్నాడు. ఎన్నిసార్లు నష్టాల పాలైనప్పటికీ అదే పుడమి తల్లిని నమ్ముకునీ వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు. అయినప్పటికీ అన్నదాత కు తిప్పలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పదిమందికి అన్నం పెడుతున్న దేవుడు మాత్రం అన్నదాతపై కాస్తయినా కరుణ చూపించడం లేదు. దీంతో రోజు రోజుకి రైతులకు అవస్థలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ప్రకృతి విపత్తుల కారణంగా దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు ఎంతోమంది అన్నదాతలు.



 ఇదిలా ఉంటే అటు కొన్ని కొన్ని సార్లు దేవుడు అన్నదాతల పట్ల కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నాడు. ఇతరులు చేసిన తప్పుకు అన్నదాతల ప్రాణాలను సైతం తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  ఆకతాయి చేసిన పనికి పదిమందికి అన్నంపెట్టే అన్నదాత నిండు ప్రాణం బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఒక ఆకతాయి సరదాగా చేసిన పని ఏకంగా నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..  కర్నూలు జిల్లా సంజామల మండలం లింగందిన్నె గ్రామంలో ఇటీవలే విద్యుదాఘాతంతో రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే కింద వేలాడుతున్న తీగలను సరిచేసి క్రమంలో ట్రాన్స్కో సిబ్బంది జంప్ లను తొలగించి సరఫరా నిలిపివేశారు



 ఈ క్రమంలోనే ఒక ఆకతాయిలు చేసిన పని ఏకంగా అనర్థానికి  దారి తీసింది. గుర్తుతెలియని వ్యక్తి మూడు తీగల్లో ఒకదానికి విద్యుత్ సరఫరా అయ్యేలాగా తీగను అతికించాడు. అయితే ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే 45 ఏళ్ల రైతు అటువైపుగా వెళ్లి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనివాసులు వ్యవసాయ క్షేత్రాన్ని చూసుకోవడంతో పాటు పాడి పరిశ్రమ లో భాగంగా బర్రెల ను కూడా కాస్తూ  జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే తాగునీటి కోసం పక్క పొలం లోకి వెళ్తుండగా మధ్యలో వేలాడుతున్న విద్యుత్ తీగలు  గాలుల తీవ్రతతో అతని మెడకు వచ్చి తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై నా రైతు శ్రీనివాసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఇంటి పెద్ద ను కోల్పోయిన కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: