హైదరాబాద్ మీదుగా ఇంత డ్రగ్స్ రవాణా అవుతుందా..?

MOHAN BABU
 గత కొంత కాలంగా  భారతదేశంలోని  కొన్ని విమానా శ్రయాల్లో డ్రగ్స్ , హేరైన్, తదితర మాదకద్రవ్యాలు  ఎక్కువ మొత్తంలో పట్టుబడుతున్న సంఘటనలు ఈ మధ్య మనం చూస్తున్నాం. అతి ముఖ్యంగా  హైదరాబాద్ పట్టణంలోని శంషాబాద్ ఎయిర్పోర్టులో గత కొద్ది రోజుల కాలంలోనే మూడు సార్లు చాలా పెద్ద మొత్తంలో  డి ఆర్ ఐ ఆఫీసర్లు ఈ యొక్క డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.  వీటిపై  డి ఆర్ ఐ విచారణలో కొన్ని షాకింగ్  సంఘటనలు వెల్లడయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి  రవాణా అవుతున్న ఈ యొక్క మాదకద్రవ్యాలను  ఇండియాలోని  పలు ప్రధాన నగరాల మీదుగా  ఇతర పాశ్చాత్య దేశాలకు రవాణా చేస్తున్నారని డి ఆర్ ఐ తెలిపినది.


పట్టుబడిన డ్రగ్స్ చాలా నాణ్యమైనదని, తద్వారా ఇది తాలిబన్ల  నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి వస్తుందని వారు గుర్తించారు. దీనిని మొదట  మొజాంబిక్, దోహా లాంటి దీవులకు ముందుగా అక్రమ రవాణా చేసి ఆ ప్రాంతం నుంచి  ఇండియాలోకి పలు పట్టణాలకు తీసుకువస్తున్నారని మరియు ఇండియా నుంచి  ఆస్ట్రేలియా, అమెరికా ప్రాశ్చాత్య దేశాలకు పంపిస్తూ ఉన్నారని డి ఆర్ ఐ ఒక నివేదిక విడుదల చేసింది. ఎక్కువగా తాలిబాన్ల ప్రాబల్యం ఉన్నటువంటి దేశాలనుంచి  వస్తున్నటువంటి ఈ డ్రగ్స్ ఆఫ్రికాకు చెందిన అటువంటి కొన్ని డ్రగ్స్  మాఫియాలు ఈ మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నట్టు సమాచారం. దీనిని  ఎయిర్ పోర్ట్ ల వద్ద దొరుకుతున్న దాని కంటే ఓడరేవుల ద్వారా అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుందని  డి ఆర్ ఐ  పేర్కొంది.


డి ఆర్ ఈ ఐ దర్యాప్తు మీద దృష్టి సారించి నటువంటి నిఘా సంస్థలు, వాళ్ళ యొక్క కదలికలపై  ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాయి. ఈ డ్రగ్స్ తో దేశంలో హింసాత్మక సంఘటనలు ప్రేరేపించేందుకే   వీరు ప్రయత్నాలు చేస్తున్నారని అన్న కోణంలో దర్యాప్తు బృందాలు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో డి ఆర్ ఐ కి పట్టుబడ్డ వారిలో చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు లాంటి విమానాశ్రయాలను కేంద్రాలుగా చేసుకొని ఈ యొక్క డ్రగ్స్ ను దేశంలోకి రవాణా చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి  ఇతర దేశాలకు ఏవిధంగా వెళుతున్నాయి ఎవరు నడిపిస్తున్నారని దానిపై  దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: