కసాయి కొడుకులు: కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన వైనం..?

MOHAN BABU
నవమాసాలు మోసి పెంచి పెద్ద వాళ్లని  చేసిన వారికి ఆ తల్లి  భారంగా మారింది. ఆ కసాయి కొడుకులు ఆ తల్లిని వదిలించుకోవాలి అనుకున్నారు. ముసలి వయసులో ఉన్న తల్లిని  అలనా పాలనా చూడాల్సిన ఆ కుమారులు కర్కాషంగా వ్యవహరించారు. తల్లి ఉంటే భారం అనుకున్నారు. ఆ తల్లిని బజారులో వదిలిపెట్టి వెళ్లిపోయారు.  మీరు పుట్టినప్పుడే ఆ తల్లి కూడా మిమ్మల్ని  ఏదైనా పొదల్లో పడవేసి ఉంటే మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఒక పొజిషన్ లో నిలబెట్టినందుకు ఆ తల్లికి ఇంతటి శాపంగా మారారు  ఆ కుమారులు.

 రోడ్డుపై వదిలి పెట్టినప్పుడు ఆ తల్లి ఎంతో ఆకలితో అలమటించినది. ఎక్కడ పని చేసే ఓపిక లేక న్యాయం కోసం చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఆమె యొక్క దీనగాథ విన్న పోలీసులు ఎంతో మానవీయంగా స్పందించి, ఆ తల్లికి కడుపు నిండా తిండి పెట్టి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే  కమలాపూర్ మండల కేంద్రంలోని  గుండెడు గ్రామానికి చెందిన మేకల పోచమ్మ 70 సంవత్సరాలు. ఆమె భర్త ఏడాదిన్నర కింద మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మేకల రాజయ్య, మేకల సత్తయ్య, కూతురు గట్టమ్మ  ఈ ముగ్గురు ఆమె సంతానం. తమ తండ్రి చనిపోయినప్పటి నుంచి  ఈ తల్లి యొక్క బాగోగులు  చూసుకోవడం మానేశారు. కనీసం తిండి కూడా పెట్టకుండా తల్లిని గాలికి వదిలేశారు.

 దీంతో తమ మీద ఆధారపడి ఉన్నటువంటి ఇంకా పెళ్లి కాకుండా ఉన్నా  తన కూతురు గట్టమ్మ 45 సంవత్సరాలు ఆమెతో కలిసి న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. దీంతో వెంటనే స్పందించినటువంటి కమలాపూర్ ఇన్ స్పెక్టర్ పి. కిషన్  వారి యొక్క బాధలు తెలుసుకుని ఎంతో చలించిపోయారు. ఎంతో ఆకలితో వచ్చిన వారిద్దరికీ భోజనం పెట్టించారు. చివరికి వారికి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ సంఘటన  సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయింది. దీంతో ఎస్ఐ కీ పలువురు అభినందనలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: