ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు.. అలా చేయలేదని చివరికి ప్రాణం తీసాడు?
ప్రియురాలు అంటే అతనికి చచ్చేంత ప్రేమ.. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రియురాలిని కలిసేందుకు ఏకంగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాడు. ఇక ప్రియురాలితో ఎంతో ప్రేమగా మాట్లాడాడు. ఇక తిరిగి వెళ్ళే సమయంలో ప్రియురాలిని కూడా తనతో పాటు తీసుకెల్లాలి అని అనుకున్నాడు. ఇక తనతోపాటు వస్తావా అంటూ ప్రియురాలు అని అడిగాడు కానీ రానురాను అంటూ ముఖం మీద చెప్పేసింది. ఇక కాసేపు బ్రతిమిలాడాడు. అయినప్పటికీ ప్రియురాలు మాత్రం అతనితో వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఉన్మాదిగా మారి పోయాడు సదరు యువకుడు. ఇలాంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలిని దారుణంగా హత్య చేసి వెళ్ళిపోయాడు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పూజ అనే 21 ఏళ్ల యువతి రాజేశ్ వర్మ అనే యువకుడు ఈ ఏడాది ఏప్రిల్లోనే పెళ్లి చేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చి జీడిమెట్ల వినాయకనగర్ లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. భర్త స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. పూజ హౌస్ వైఫ్ గా ని ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలోనే పూజ మాజీ ప్రియుడితో ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఇక ఓసారి జార్ఖండ్ లో ఉన్న ప్రియుడిని ఏకంగా హైదరాబాద్ నగరానికి రావాలి అంటూ కోరింది పూజ. ప్రియురాలు కోరడంతో ఆగమేఘాల మీద కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ప్రియుడు ప్రియురాలి ముందు వాలిపోయాడు. ఈ క్రమంలోనే తిరిగి వెళ్ళే సమయంలో తనతో రావాలని ఇద్దరం కలిసి ఆనందంగా ఉందాం అంటూ ప్రియురాలుని కోరాడు ప్రియుడు. కానీ ఆమె మాత్రం నిరాకరించింది. దీంతో దీంతో దిండుతో ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. ఇక పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన భారత బెడ్ పై భార్య విగతజీవిగా పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది..