కొంతమంది అధికారుల సహాయంతోనో, నాయకుల సాయంతోనో ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారు. అక్రమంగా సంపాదించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లి చివరకి ఇలాగే బోర్లా పడతారు. మొన్నటికి మొన్న రైతు భీమా పథకంలో ఇలాగే జరిగి చివరకు దొరికిపోయారు. అది మరువక ముందే ఈ ఘటన మళ్లీ వెలుగులోకి వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఒక జంటకు ఆరు సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. ఇటీవల కాలంలో వారికి కల్యాణలక్ష్మి కూడా మంజూరు అయింది. ఇంతలోగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ దంపతులకు ఆరు సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. ఇటీవల సమయంలో కల్యాణలక్ష్మి కూడా మంజూరు అయింది ఈలోగా అసలు విషయం బయటకు రావడంతో ఆ చెక్కును నిలిపివేశారు. తప్పుడు పత్రాలతో ఈ విధంగా చేసినట్టు అధికారులు గుర్తుపట్టారు. ఇందులో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, కొంతమంది అధికారుల సహకారం కూడా ఉందని సమాచారం. ఈ యొక్క ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలోని చిన్నంబావి మండలంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే చిన్నంబావి మండల కేంద్రంలోని ఓ గ్రామానికి చెందినటువంటి రెడ్డి రెడ్డి కులస్తులు అయినా ఒక మహిళకు 2015 లోనే పెళ్లి జరిగింది. ఆ సమయంలో వారి యొక్క రెడ్డి సామాజిక వర్గానికి కళ్యాణ లక్ష్మి పథకం అందుబాటులో లేదు. వీరికి కూడా అమలు చేస్తూ 2018లో జాబితా తయారు చేశారు. అయితే అప్పటికే వివాహం జరిగి వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే సదరు మహిళ 2021 ఫిబ్రవరి లో కళ్యాణ లక్ష్మి కొరకు దరఖాస్తు కూడా చేసుకున్నది. నాకు 2018 నవంబర్ లో పెళ్లి జరిగినట్టు తెలిపింది. దీనికి సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలను కూడా సృష్టించింది. దీంతో అధికారులు వారికి కల్యాణ లక్ష్మి మంజూరు చేశారు. కానీ అక్కడే అసలు ట్విస్టు మొదలైంది.
2 సంవత్సరాల క్రితం వివాహం జరిగిన జంటకు మూడు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లలు ఎలా వచ్చారనేది చర్చకు దారి తీసింది. దీంతో విషయం బయటకు వచ్చింది. వీరికి 2015 వ సంవత్సరంలోనే పెళ్లి జరిగినట్టుగా తెలిసింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించారని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రావడంతో ఆ మహిళకు మంజూరు అయినటువంటి ఆ చెక్కును అధికారులు నిలిపివేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి కల్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకున్నారని ఆ విషయం మా దృష్టికి వచ్చిందని, దీనికి సహకరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలియజేశారు.