అదృష్టం అంటే ఈ తాగుబోతు దే. పీకలదాకా ఫుల్గా తాగాడు. బారి నుంచి బయటకు వచ్చి వారు ముందు ఒక వ్యక్తితో గొడవ పడ్డాడు. తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన వ్యక్తి ఆ బార్ లో మందు తాగడం వల్లనే గాయలపాలయ్యారు అని సదరు బార్ పై కేసు వేశాడు. దీంతో ఆ బార్ ఓనర్ మిలియన్ డాలర్లు అతనికి చెల్లించవలసి వచ్చింది. కొద్ది మందిని చూస్తే వీళ్లకు ఎక్కడో ఒక దగ్గర అదృష్టం దాగివుందని అనుకుంటారు. వారికి ఆవిధంగా సుడులు తిరిగి ఉంటాయి. అలాంటి ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అతను ఒక తాగుబోతు. రోజు లాగానే ఆ రోజు కూడా ఆ బార్లో ఫుల్ గా తాగాడు. ఆ మత్తులో బయటకు వచ్చి ఒక వ్యక్తితో బాగా గొడవ పడి గాయపడ్డాడు. మందు అంతా దిగాక తాను ఆ బార్ లో మందు తాగడం వల్లనే ఇలా జరిగిందని సదరు బారు పైనే కేసు వేశాడు. దీంతో ఆ బార్ యజమాని నుంచి 40 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని తీసుకున్నాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది.. టెక్సాస్ కు చెందినటువంటి డానియల్ రాల్స్ అనే వ్యక్తి ఆండ్రూస్ లోని లా పగొట దిల్ బార్ అండ్ రెస్టారెంట్ లో బాగా మద్యం సేవించాడు.
ఆ తర్వాత కార్ పార్కింగ్ చేసే దగ్గర ఒక వ్యక్తితో గొడవకు దిగాడు. ఈ గొడవలో రాల్స్ యొక్క తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతను ఆస్పత్రికి వెళ్లి కోలుకొని వచ్చిన తర్వాత అతను మద్యం తాగిన బార్ పై కేసు వేశాడు. ఆ రెస్టారెంట్ వాళ్లనే తను బాగా తాగాను అని దీంతో నా ప్రాణం మీదకు వచ్చిందని తెలిపాడు. వాళ్ల నిర్లక్ష్యం వల్ల నేను ఫుల్ గా తాగాల్సి వచ్చిందని ఇలాంటి నేరాలకు పాల్పడేలా చేశారని, వాళ్లు టూమచ్ గా సర్వ్ చేస్తేనే నేను ఇలా తాగాను అని, నేను వారి బారు దగ్గర గొడవ పడుతున్న నిర్వాహకుల నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదని, నేను గాయపడ్డక కనీసం అంబులెన్స్ కు కూడా సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు చేశాడు.
బారు యజమానితో పాటు, తనకు సర్వే చేసిన వ్యక్తులను నిందితులుగా కేసు వేశాడు. దీంతో ఇది పరిగణలోకి తీసుకున్నా కోర్టు, సదరు బార్ ఓనర్ పై తాగుబోతుకు సపోర్టుగా తీర్పును వెలువరించింది. నష్టపరిహారం కింద ఐదు మిలియన్ డాలర్ల ఇవ్వాలని ఇప్పుడు ఇచ్చింది. ఈ తీర్పును సదర్ బార్ ఓనర్ దిక్కరించగా మరో అర మిలియన్ డాలర్లను రాల్స్ కు చెల్లించాలని మళ్ళి ఒక తీర్పులో ఆదేశించింది. దీంతో ఆ తాగుబోతుకు మొత్తం 40 కోట్ల రూపాయలు నష్ట పరిహారం అందింది అని చెప్పవచ్చు.