ప్రాణం తీసిన కోడి కూర.. ఇద్దరు మృతి?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటునుంచి దూసుకు వస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. ఈ భూమ్మీద నూకలు తినే బాకీ లేకపోతే సాఫీగా సాగిపోతున్న జీవితంలో కూడా అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఆనందంగా ఉన్న  జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంటుంది. సంతోషంగా ఉన్న కుటుంబంలో మృత్యువు తీరని శోకాన్ని మిగుల్చుతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా కోడి కూర తిని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా తల్లి ఇక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 అనుకోని ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.  వివరాల్లోకి వెళితే తూప్రాన్ మండలం వెంకటాయపల్లి కి చెందిన  మల్లేష్ బాలమణి దంపతులకు మనీషా, కుమార్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మనోహరాబాద్ గ్రామ శివారు లోని ఒక కోళ్ల ఫారం లో మల్లేష్ దంపతులు పనిచేస్తున్నారు. అయితే ఇటీవలే ఇక ఫారం లోని కోళ్లను యజమాని తీసుకెళ్లాడు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న కొన్ని కోళ్లను అక్కడే వదిలేశాడు.  అయితే ఇక ఆ కోళ్లను కోసి పిల్లలకు వండి పెట్టాలి అని తల్లి బాలమణి అనుకుంది. అలా చేస్తే పిల్లలు సంతోష పడతారు అని అనుకుంది. కానీ పిల్లల ప్రాణం పోతుంది అని మాత్రం ఊహించలేకపోయింది. ఇక వ్యాధి బారిన పడిన కోళ్లను వండి పెట్టగానే ఎంతో ఇష్టంగా తిన్నారు పిల్లలు. బాలమణి కూడా ఆ వండిన కూర తిన్నది.. కానీ మల్లేష్ మాత్రం ఏదో పని నిమిత్తం బయటికి వెళ్లి ఇంకా తినలేదు. కాగా రాత్రి సమయంలో కడుపు నొప్పిగా ఉంది అంటూ బాలమణి సహా పిల్లలు కూడా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు.



 దీంతో ఒక్కసారిగా కంగారు పడిపోయాడు మల్లేష్. ఇక వెంటనే వారిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు మల్లేష్. ఇక వారి పరిస్థితి విషమించడంతో మేడ్చల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ వారు చికిత్స చేయడానికి నిరాకరించారు. దీంతో చేసేదేమీలేక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే ఇద్దరు చిన్నారులు చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఇక అప్పటికే బాలమణి పరిస్థితి కూడా విషమించింది . ఇక ఆమెను కొంపల్లి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు  వ్యాధి బారిన పడిన కోళ్లను తినటం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: