కాబోయే భార్యపై కక్ష.. ఏం చేశాడో తెలుసా?
మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పైన కక్ష కట్టాడు. చివరికి ఆమెనూ సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు వరకు కాబోయే భార్యకు ఎంతోమంది యువకులు గిఫ్టు ఇవ్వడం చూసి ఉంటాము కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి మాత్రం ఏకంగా కాబోయే భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించాడూ. ఇక ఈ ఘటన కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. విజయనగరం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామానికి చెందిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాంబాబు అనే వ్యక్తికి చౌడువాడ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇక మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగబోతుంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ ఏకంగా రాంబాబు దారుణంగా ప్రవర్తించారు. కాబోయే భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలోనే రాంబాబు ను అడ్డుకునేందుకు బాధితురాలి సోదరి ప్రయత్నించింది. దీంతో రాంబాబుకి బాధితురాలి సోదరికి మధ్య కొంత సేపటి వరకు తోపులాట కూడా జరిగింది. అప్పటికే మంటలు వ్యాపించడంతో బాధితురాలు సోదరి తో పాటు ఆమె కుమారుడు కూడా తీవ్ర గాయాలయ్యాడూ. అప్రమత్తమైన స్థానికులు గాయపడ్డ ముగ్గురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.