వామ్మో.. ఇంత చిన్న విషయానికి చంపుతారా?

praveen
అసలు మనిషి ప్రాణాలకు విలువ ఉందా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఉంది అని చెప్పలేము. ఎందుకంటే మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు ఇక ఇప్పుడు అదే మానవత్వాన్ని కోల్పోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఉన్మాదులు గా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాటి మనుషుల విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు అంతే కాదు ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. చిన్న చిన్న విషయానికి దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఎంతోమంది.



 ఇక క్షణికావేశంలో ప్రాణాలు తీస్తూ చివరికి జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇటీవలి కాలంలో అయితే ఏకంగా చిన్న చిన్న గొడవలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంతవరకు వెళుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ స్నేహితులు..  ఒకే దగ్గర పని చేస్తున్నారు..  అయితే ఈ  ఇద్దరి మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ స్నేహితులను శత్రువులుగా మార్చేసింది. అంతేకాదు ఇక ఏకంగా ఒకరి ప్రాణం పోయేంతవరకు దారితీసింది.  కూలీ డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ ఇక స్నేహితుని హత్య చేసే వరకు తీసుకెళ్ళింది. Ee ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 కూలీ డబ్బుల విషయంలో గొడవ జరగడంతో హమాలి శివ అనే వ్యక్తిని స్నేహితుడు కుమ్మరి రాజు దారుణంగా హత్య చేశాడు. గుడి కాడికి శ్రీధర్ అలియాస్ శివ, కుమ్మరి రాజు ఇద్దరు  కలిసి కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకు లో కూలీలుగా పనిచేస్తున్నారు. మంచి స్నేహితులుగా వుండేవారు. వీరి మధ్య ఇటీవల కూలీ డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శివ పై కక్ష పెంచుకున్నాడు కుమ్మరి రాజు. స్నేహితుడినీ హత్య చేయాలనుకున్నాడు. ఇటీవలే పాండురంగ స్వామి ఆలయం వద్ద దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని శంకర్పల్లి కంది మార్గంలో పడేసాడూ. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిందితుడు కుమ్మరి రాజుగా తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: