అన్న శవానికి రాఖీ కట్టిన చెల్లెలు?

praveen
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగగా రక్షా బంధన్. ఇక రక్షాబంధన్ పండుగ రోజు ప్రతి చెల్లి ప్రతి అక్క తమ అన్నదమ్ములకు రాఖీ కట్టడానికి వెళ్తూ ఉంటుంది.  అయితే ఎంత దూరంలో ఉన్నప్పటికీ రాఖీ పౌర్ణమి రోజున మాత్రం తప్పకుండా అందరూ కలిసి రాఖీ కట్టడం ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రక్షాబంధన్ రోజు అన్న చెల్లెళ్లు మాత్రం కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది.  కానీ ఇక్కడ ఒక చెల్లెళ్ళ విషయంలో రక్షాబంధన్ రోజే ఊహించని విషాదం చోటుచేసుకుంది.


 ప్రతి ఏడాది ఎంతో సంతోషంగా అన్నకు రాఖీ కట్టే వారు ఆ చెల్లెలు. ఈ క్రమంలోనే ఈ సారి కూడా ఇక అన్నయ్యకు రాఖీ కట్టాలని అనుకున్నారు. ఇక ఇటీవలే రక్షాబంధన్ పురస్కరించుకొని  ఇక అన్నయ్యకు రాఖీ కట్టాడనికి వెళ్లారు  చెల్లెళ్లు .  ఇక అన్నయ్య ఎంతో సంతోషంగా తమకు స్వాగతం పలుకుతాడూ అని అనుకున్నారు. కానీ ఇంటికి వెళ్లేసరికి ఇక ఆనందంగా రాఖి కట్టించుకోవలసిన అన్న శవమై కనిపించడంతో ఇక ఆ చెల్లెల్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనుకోని విషాద ఘటన తో ఏకంగా అరణ్యరోదనగా విలపించారు.


 ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా మాడుగుల పల్లి లో వెలుగులోకి వచ్చింది. రాఖీ కట్టేందుకు వెళ్లిన అన్నయ్య క్షణాల ముందు చనిపోయాడు అని తెలియడంతో అక్కాచెల్లెళ్ల మనసు పగిలిపోయింది. దీంతో ఇక అన్నయ్య మీద పడి భోరున విలపించారు. మల్లిపూడికి చెందిన లక్ష్మయ్యకు ఐదుగురు చెల్లెలు ఉన్నారు   ప్రతి యేటా ఇక అన్నయ్యకు ఎంతో ఆనందంగా రాఖీ కడుతూ ఉంటారు చెల్లెల్లు. ఇక ఈ ఏడాది కూడా అన్నయ్య కు ఆనందంగా రాఖీ కట్టేందుకు వెళ్లగా నిమిషాల ముందే  అన్నయ్య ప్రాణాలు వదిలాడు. దీంతో ఇక మరణించిన అన్నను చూసి అరణ్యరోదనగా విలపించారు చెల్లెల్లు. అన్న శవాని కి రాఖీ కట్టారు. ఈ  ఘటన అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: