ప్రస్తుత కాలంలో సోషల్
మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరు చేతుల్లోకి మొబైల్
ఫోన్ వచ్చింది. దీంతో వయస్సుతో భేదం లేకుండా చాలామంది మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఇది మనకు ఎంత మంచి చేస్తుందో. చెడు కూడా ఆ విధంగా చేస్తుందని చెప్పవచ్చు. అది ఎలా అంటే మనం దానిని ఏ విధంగా స్వీకరిస్తే ఆ విధంగానే మనకు రిజల్ట్ వస్తుంది. కొంతమంది తెలిసీ తెలియని వయసులో చాటింగులు, వీడియో కాల్ ఇలా వారికి తెలియకుండానే వేరొకరి ఉచ్చులో పడుతున్నారు. చివరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అలాంటి ఓ ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 14 సంవత్సరాల బాలికను చేసినటువంటి ఐదుగురు వ్యక్తులు సదరు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఒక మైనర్ బాలిక తో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి ఇంటి వరండాలో నిద్రిస్తున్న సమయంలో రాంపూర్ ప్రాంతంలోని దుండగులు బాలిక ఇంటిలోకి ప్రవేశించి నోటిలోకి గుడ్డలు కుక్కి అనంతరం అమెరి కిడ్నాప్ చేశారు.
సదరు దుండగులలో ఒకరైనా వ్యక్తికి దుకాణం ఉన్నది. ఆ బాలికను అక్కడికి తీసుకెళ్లి వీరంతా కలిసి అత్యాచారం చేశాడు. తర్వాత సదరు బాలిక అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తీసుకెళ్లి వారి ఇంటి దగ్గర వదిలి వెళ్లారు. కొద్ది సమయం తర్వాత స్పృహలోకి వచ్చినటువంటి బాలిక వారి కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని తెలిపింది. ఈ యొక్క ఘటనపై బాలిక
తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ కూడా చేపట్టారు.
ఇందులో మొత్తం ఐదుగురు దుండగుల పై కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ దుండగులలో ఒకరితో బాలికకు పరిచయం ఉన్నట్టు విచారణలో తేలింది. ఓ మైనర్ బాలికను వైద్య పరీక్షల కొరకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాంపూర్ ఎస్పి అంకిత్ వివరాలను వెల్లడించారు. అయితే ఆమెపై పూర్తిగా లైంగికదాడి జరిగినట్టు నిర్ధారణ అవ్వలేదని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నదని, సదరు మైనర్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తామని తెలిపారు.