నెల క్రితమే తల్లి మృతి.. అంతలోనే?
అయితే ఆ యువకుడి తల్లి కూడా కేవలం నెల రోజుల కిందటే మరణించడంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే కందుకూరు మండలం లోని రాచులూర్ కు చెందిన శ్రీనాథ్ అనే 23 ఏళ్ల కుర్రాడు సమీపంలో ఉన్న అమెజాన్ కంపెనీ లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే అతని కుటుంబం మొత్తం వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ ఎంతో సంతోషంగా ఉంది. కానీ వారి సంతోషాన్ని చూసి విధి ఓర్వ లేక పోయింది. నెల రోజుల క్రితమే ఏకంగా శ్రీనాథ్ తల్లి మరణించింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
ఇక ఎంతో బాధను మనసులో దాచుకుని శ్రీనాథ్ సెక్యూరిటీ గార్డు విధులకు హాజరవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మధ్యాహ్న సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ బైక్ను ఢీకొట్టింది. దీంతో టిప్పర్ చక్రాల కింద పడ్డ శ్రీనాథ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఇలా కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో మిగతా కుటుంబ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు. మృతుడికి తండ్రి చెల్లెలు ఉన్నారు. ఇక తమకు న్యాయం చేయాలి అంటూ కుటుంబ సభ్యులందరూ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.