సినిమా రేంజ్ కాదు.. అంతకుమించి.. గోల్డ్ స్మగ్లింగ్?

praveen
సాధారణంగా మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం..  గోల్డ్ స్మగ్లింగ్ లేదా మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడానికి కేటుగాళ్లు ఎంతో వినూత్నమైన రీతిలో ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఒక దేశం నుంచి మరో దేశానికి ఇలాంటివి అక్రమ రవాణా చేయడానికి ఇక ఎయిర్పోర్టులో అధికారులకు దొరకకుండా ఒక రేంజ్ లో ప్లాన్ వేసుకొని వస్తూ ఉంటారు. ఇలా కొంతమంది ఇక ఎయిర్ పోర్ట్లో అధికారులతో దొరకకుండా అక్రమ రవాణా చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం దొరికిపోతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో సినిమాల్లో కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే రియల్ లైఫ్లో కూడా ఎంతోమంది కేటుగాళ్లు వినూత్నంగా ఆలోచించి అధికారులకు షాకిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 కేటుగాళ్లు అక్రమంగా బంగారాన్ని లేదా మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడం కోసం వినూత్నమైన పోకడలకు వెళ్లిన ఘటనలు ఎన్నో సార్లు తెర మీదికి వచ్చాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది మాత్రం సినిమా రేంజ్ కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే ఉంది. కేటుగాళ్లు అధికారులకు దొరకకుండా వేసిన ప్లాన్ మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది.  ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తుంటే బంగారం స్మగ్లింగ్ చేయడం లో స్మగ్లర్లు ఏ రేంజ్లో ఆరితేరారు అన్న విషయాన్ని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  ఇక అధికారుల కళ్లుగప్పెందుకు స్మగ్లర్లు అనుసరించిన విధానం ప్రస్తుతం అవాక్కయ్యేలా చేస్తుంది.


 ఎలా బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన అధికారులకు దొరికిపోతున్నాము అనుకున్నారేమో ఏకంగా బంగారాన్ని పలుచగా చేసి పూసిన ప్యాంటు ధరించి ఒక వ్యక్తి ఎయిర్పోర్టులో దర్జాగా బయలుదేరాడు. ఈ క్రమంలోనే కేరళలోని కన్నూరు ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టిన ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులకు చివరికి దొరికిపోయాడు. ఏకంగా 14 లక్షల రూపాయల విలువైన 302 గ్రాముల బంగారాన్ని పలుచగా చేసి ఇక తన జీన్స్ ప్యాంటు పోసుకొని అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించాడు. ఇక ఈ బంగారం మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: