హెయిర్ కటింగ్ విషయంలో గొడవ.. చివరికి?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఎవరైనా హెయిర్ కట్ కు వెళ్ళినప్పుడు ఇక ఆ షాప్ లో ఎవరైనా స్నేహితులు ఉంటే హెయిర్ కట్ గురించి కామెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇలా సరదాగా చేసిన కామెంట్ ఇక్కడ ఒక వ్యక్తి ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆంజనేయులు అనే వ్యక్తి హెయిర్ కటింగ్ కోసం స్థానికంగా ఉన్న ఒక సెలూన్ కి వెళ్ళాడు. అక్కడ చల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఆంజనేయులు శ్రీనివాసరావు స్నేహితులు.
ఈ క్రమంలోనే స్నేహితుడు అనే చనువుతో శ్రీనివాసరావు కటింగ్ సరిగా చేసుకోరా అంటూ ఆంజనేయులుకు చెప్పాడు. శ్రీనివాస్ రావు అలా అనడంతో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఆంజనేయులు ఏకంగా శ్రీనివాస రావు ని దారుణంగా తిట్టడమే కాదు చెంప మీద కొట్టాడు. ఇక పక్కనే ఉన్న శ్రీనివాస్ రావు కొడుకు నాగేంద్ర మా నాన్ననె కొడతావా అంటూ ఆంజనేయులుతో గొడవ పడ్డాడు. ఇక ఈ ఘర్షణలో ఏకంగా నాగేంద్ర మెడపై ఎడమ చేతి పై కత్తితో దాడి చేశాడు ఆంజనేయులు. ఘటనలో గాయపడిన నాగేంద్రనీ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.