ప్రస్తుతం టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో, మనకు క్షణాల్లో అందుతోంది. భూమి మీదనే కాకుండా అంతరిక్షంలోకి కూడా మానవాళి ప్రయాణించి వస్తోంది. గాల్లో మేడలు కడుతోంది. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి చూపిస్తోంది టెక్నాలజీ. ఇంత టెక్నాలజీ సాధించిన ఈ కాలంలో మంత్రాలు, తంత్రాలు, పూజలు పునస్కారాలు ఉన్నాయంటారా..? ఒకవేళ అదే కనక ఉంటే మరి కరోనాకు మందు ఎందుకు కనిపెట్టలేక పోతున్నారు. ఎందుకు మానవాళిని బ్రతికించుకోవే లేకపోతున్నారు.. కరోనా వస్తే మనం ఎందుకు స్వామిజిల దగ్గరికి, దేవాలయ దగ్గరికి పోవడం లేదు. కొద్దిగా ఆలోచించాలి.. అలా ఆలోచించాల్సిన ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఈ స్వామీజీ మాయలో పడి మోసపోయింది. మంత్రాలకు చింతకాయలు రాలవు అని సత్యాన్ని గ్రహించలేక పోయింది.
అసలు ఏం జరిగింది. ఎంబిబిఎస్ డాక్టర్ ఎందుకు మోసపోయింది. ఇలాంటి స్వామీజీల బారినపడి ఎందరో అమాయకులు. వీరికి తోడు ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు కూడా మోసానికి గురవుతున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి ఓ నలభై ఒక్క సంవత్సరాల మహిళా ప్రస్తుతం కొండాపూర్లో నివసిస్తోంది. ఆమె 2011 సంవత్సరంలోనే తను ఎంబి బిఎస్ చదువుతూ విదేశాలలో పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చింది. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివినవారు మన దగ్గర ఏదైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ మహిళ ఎఫ్ ఎం జి ఈ ఎగ్జాం ఎన్నిసార్లు రాసిన ఫెయిల్ అవుతూనే ఉంది. దీంతో ఆ డాక్టర్ ఒక ఆన్లైన్ లో చూసి బిశ్వజిత్ అనేటువంటి ఒక స్వామీజీని కలిసి తన విషయాన్ని చెప్పింది. దీంతో ఆ వ్యక్తి నువ్వు ఒక పూజ చేయాలి. అది చేస్తే నువ్వు ఎలాంటి ఎగ్జామ్ అయినా సింపుల్ గా బయట పడతావని నమ్మించాడు. దీంతో ఆ డాక్టర్ ఆ స్వామి యొక్క ఖాతాలో ముందుగానే ఇరవై రెండు వేల రూపాయలను జమ చేయాలని అన్నాడు. అతడు చెప్పినట్టుగానే డాక్టర్ చేసింది . ఆ మహిళ స్వామీజీ ఆమెకు పూజ కూడా చేశాడు. గత సంవత్సరం డిసెంబర్ లో ఆమె ఎగ్జామ్ కూడా రాసింది. కానీ ఉత్తీర్ణత సాధించలేదు.
దీంతో ఆ డాక్టర్ స్వామీజీని ఇలా ఎందుకు జరిగింది అంటూ గట్టిగా అడిగింది. దీంతో సదరు స్వామీజీ పూజ చేసే క్రమంలో ఏదో లోపం జరిగిందని, మరోసారి కాలభైరవ అనే పూజ చేస్తే పాస్ కచ్చితంగా అవుతుందని , దీంతోపాటుగా మంచి మార్కులు కూడా వస్తాయని దీని కోసం 60 వేల రూపాయలు ఇవ్వాలి అని అడిగాడు. అతను చెప్పినట్టుగానే డాక్టర్ మళ్లీ 60 వేల రూపాయల తన ఖాతాలోకి జమ చేసింది. ఈ ఏడాది కూడా పరీక్ష రాసిన ఆమె మళ్లీ ఫెయిల్ అయిపోయింది. దీంతో కోపానికి వచ్చిన ఆమె ఎందుకిలా జరిగిందని స్వామీజీ నిలదీస్తే ఏమి చెప్పలేదు. దీంతో ఆ డాక్టర్ గచ్చిబౌలి పోలీసులకు ప్రియ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన టువంటి పోలీసులు ఆ స్వామీజీ కూపీ లాగితే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అయితే ఈ స్వామిజి దగ్గర చాలామంది విద్యావంతులే మోసపోయారని తేలింది.