బ్యాక్ లాగ్స్ ఉన్నాయని.. బీటెక్ విద్యార్థి షాకింగ్ నిర్ణయం?

praveen
ఒకప్పుడు ఏ విషయాన్ని అయినా అర్థం చేసుకొని చదివేవాళ్ళు..  చదువుకున్న దాన్ని ఎంతో బాగా గుర్తు పెట్టుకునే వారు..  గుర్తుపెట్టుకున్న దాన్ని పరీక్షల్లో రాసి మంచి మార్కులు తెచ్చుకునే వారు కానీ నేటి రోజుల్లో మాత్రం పోటీ ప్రపంచంలో బట్టీపట్టి చదవడమే ఎక్కువైపోతుంది. దీంతో ఆ చదివేది గుర్తుండక చివరికి పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఎంతోమంది విద్యార్థులు మనస్తాపం చెందుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. నేటి రోజుల్లో బట్టీపట్టి చదివే చదువులు ఎంతో మంది విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఈ క్రమంలో ఎంతోమంది విద్యార్థులు బట్టీపట్టి చదవడం ఇష్టం లేక... చదివింది అర్థం కాక చివరికి పరీక్షలలో ఫెయిలై మనస్తాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకొని బలవన్మరణాలకు పాల్పడ్డ ఘటనలు కూడా తెర మీదికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ నేటి రోజుల్లో అయితే విద్యార్థులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.  ఇలా ఎంతోమంది విద్యార్థులు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఎంతో మంది తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుతుంది.


 ఇక్కడ ఓ బీటెక్ విద్యార్థి తీసుకొన్న నిర్ణయం కుటుంబం లో విషాదం నింపింది. సరిగ్గా చదవలేక పోతున్నాను అన్న కారణం తో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ కెపిహెచ్బి లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. మూడో అంతస్థు పైనుంచి దూకిన అనే రుత్విక్ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇక ఈ ఘటన తో అపార్ట్మెంట్ వాసులందరూ ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. అయితే బ్యాక్ లాగ్స్ ఉండడం కారణంతోనే మనస్థాపం తో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని చుట్టుపక్కల వారు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: