15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పోలీసులు ఏం చేసారో తెలుసా?

praveen
ఆడపిల్ల జీవితం అంతకంతకూ ప్రశ్నార్థకంగా మారిపోతోంది.. మారుతున్న సమాజంలో..  నాగరికత వైపు అడుగులు వేస్తున్న  రోజుల్లో ఆడ పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు తగ్గుతాయి అనుకుంటే రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నాగరికత వైపు అడుగులు వేస్తున్న మనుషులు ఇంకా అనాగరిక ఘటనలకు పాల్పడుతున్నారు.  ఆడపిల్ల అంటే ఇంకా చులకన గానే చూస్తున్నారు.  ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు మగాళ్ళు మృగాళ్ళు గా మారిపోయి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  అయితే ఇప్పటికే అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కోర్టులు ఉరి శిక్షలు విధించాయి.

 అయితే ఇంత దారుణమైన శిక్షలు విధించినప్పటికీ అటు కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. చట్టాలలో ఉన్న లొసుగులను తమ చుట్టాలుగా మార్చుకుని ఆడపిల్లలపై అత్యాచారం చేసినప్పటికీ ఎలాంటి భయం లేకుండానే సభ్యసమాజంలో తిరుగుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆడపిల్ల జీవితం రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఇక ఆడపిల్లలకు రక్షణ అనే పదమే నేటి రోజుల్లో వినిపించడం లేదు అని చెప్పాలి. నేటి రోజుల్లో దేశంలో ఎక్కడో ఓ చోట ఆడపిల్ల అత్యాచారానికి గురి అవుతూనే ఉండటం సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉల్లాస్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక రైల్వే వసతి గృహంలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అయితే బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది. కానీ ఫిర్యాదులు స్వీకరించేందుకు 2 పోలీస్ స్టేషన్లలో కూడా పోలీసులు నిరాకరించారు. దీంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు.. ఈ కేసు తమ పరిధిలోకి రాదు అని చెప్పి బాలికను స్టేషన్ నుంచి వెనక్కి పంపించారని రైల్వే అధికారులు తెలిపారు. ఇక చివరికి అటు రైల్వే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: