నిరుపేదలే టార్గెట్.. రెచ్చిపోయిన కేటుగాళ్లు?
మహిళల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు స్వయం సహాయక సంఘాలకు రుణాల పేరుతో మోసానికి పాల్పడ్డారు. దీనికోసం పక్కా ప్లాన్ వేసుకున్నారు. చివరికి అందినకాడికి దోచుకు పోయారు చిత్తూరు జిల్లాలోని తమిళనాడు సరిహద్దు గ్రామాల నే టార్గెట్ గా చేసుకుని సెంథిల్,రాజ్ కుమార్, కుమార్, సంగీత లు ముఠాగా ఏర్పడి ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఒక బురిడి ఫైనాన్స్ కంపెనీ స్థాపించి అందరిని బురిడీ కొట్టించారు.
శ్రీకాళహస్తి, సత్యవేడు, b.n. కండ్రిగ ప్రాంతాలకు చెందిన పేదలు అందర్నీ కూడా మాయ మాటలతో నమ్మించారు. ఆర్థిక సహాయం పేరుతో వడ్డీ లేకుండానే 50 వేల రుణం ఇప్పిస్తాము అంటూ చెప్పారు. ఈ క్రమం లోనే ప్రాసెసింగ్ ఫీజు ఒక్కొక్క గ్రూప్ నుంచి 10 నుంచి 15 వేల రూపాయల వరకు వసూలు చేసారు. ఇక కొంతమంది మహిళలు తమ అవసరాల కోసం రుణం పొందేందుకు సంస్థ నిర్వాహకులను సంప్రదించగా ఇవాళ రేపు అంటూ మాట దాటివేస్తు వచ్చారు. అనుమానం వచ్చి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.