వైరల్ వీడియో : బాలికను వేధించాడని.. ఏం చేశారో చూడండి?
కామం తో ఊగి పోతున్న మానవ మృగాలు ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు దారుణం గా వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఇక ఇటీవలే కామాంధులు మరింత తెగించి మరి పక్కన కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారిపై దాడి చేసి మరీ అత్యాచారాలు చేసిన ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి. దీంతో ఒంటరిగా వెళ్తున్న ఆడ పిల్లలకే కాదు కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నారని ధైర్యం కూడా ఆడ పిల్లలకు లేకుండా పోయింది. ఇక్కడ ఒక 28 ఏళ్ల యువకుడు బాలికను దారుణం గా వేధించాడు.
ఇక ఈ విషయం బంధువుల యువకులకు తెలియడం తో అతన్ని దారుణంగా చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మధ్యప్రదేశ్లోని రేవా లో బాలికను వేధించాడు అని ఆరోపిస్తూ ఇద్దరు వ్యక్తులు 28 ఏళ్ళ యువకుడి పై దాడికి దిగారు. బంధువుల అమ్మాయి ని వేధిస్తున్నాడనే కారణంతో యువకుడి తలకి బెల్ట్ కట్టి చితక బాదారు. ఇక దీన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఈ కేసులో భాగంగా మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.